డిజిటల్ మీడియాపై మోడీ కత్తి

మోడీ ప్రభుత్వం డిజిటల్ మీడియాను కంట్రోల్ చేయడానికి యత్నిస్తోంది..ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాకన్నా ఘోరం.. సోషల్ మీడియాను హేతుబద్ధం చేస్తున్నామన్న పేరిట ప్రభుత్వం దీన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది.

Advertisement
Update:2022-07-16 09:34 IST

మోడీ ప్రభుత్వం డిజిటల్ మీడియాను కంట్రోల్ చేయడానికి యత్నిస్తోంది.... సోషల్ మీడియాను హేతుబద్ధం చేస్తున్నామన్న పేరిట ప్రభుత్వం దీన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. .. ఇది ఎన్.రామ్ వంటి మీడియా నిపుణులు ఇప్పుడు కాదు.. ఎప్పుడో చెప్పారు. అలాగే గత ఏడాది మే నెలలోనే ప్రభుత్వ హిపోక్రసీ ఏమిటో ఎన్నో వెబ్ సైట్లు చెప్పకనే చెప్పాయి. ఇప్పుడు మొదటిసారిగా డిజిటల్ న్యూస్ మీడియాను రెగ్యులేట్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఓ సవరణ బిల్లుమీద దృష్టి పెట్టింది. 2019 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్ బిల్లును సవరించడానికి పూనుకొంది. ఇందులో డిజిటల్ న్యూస్ మీడియాను కూడా చేర్చారు. అంటే 1867 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ స్థానే ఇది రానుంది. దేశంలోని వార్తాపత్రికలు, ప్రింటింగ్ ప్రెస్సులు కూడా దీని పరిధిలోకి రానున్నాయి.


చాలాకాలం వరకు ప్రభుత్వ రెగ్యులేషన్స్ నుంచి డిజిటల్ మీడియా ఇండస్ట్రీని మినహాయించినప్పటికీ.. ఇక ఇది ఎంతో కాలం కొనసాగరాదని, దీన్ని మార్చేయాలని భావించిన మోడీ ప్రభుత్వం త్వరలో జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన పక్షంలో దేశంలోకి డిజిటల్ న్యూస్ వెబ్ సైట్లు వార్తాపత్రికలతో సమానమవుతాయి. అంటే ఇవి కూడా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. అసలు నిజానికి వీటికి అలాంటి అవసరం లేదు.. 'ఈ బిల్లును ఇంకా ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదించాల్సి ఉన్నా అది లాంఛనప్రాయమే.

అప్పుడే కొత్త డిజిటల్ మీడియా బిల్లుపై వివాదాలు మొదలయ్యాయి. డిజిటల్ న్యూస్ మీడియాను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం యత్నిస్తోందన్న మీడియా నిపుణుల వ్యాఖ్యలను ఇది నిజం చేస్తోందని అంటున్నారు. 2019 లోనే కేంద్రం ఓ ముసాయిదా బిల్లును రూపొందించినప్పుడే చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. అయితే మోడీ ప్రభుత్వం డిజిటల్ మీడియాను తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోజాలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అది నిజం కాదని, మేము ఇందుకే రంగంలోకి దిగామని సర్కార్ చెబుతోంది.

'న్యూస్ ఇన్ డిజిటలైజ్డ్ ఫార్మాట్ దట్ కెన్ బీ ట్రాన్స్ మిటెడ్ ఓవర్ ది ఇంటర్నెట్, కంప్యూటరైజ్డ్ నెట్ వర్క్స్ అండ్ ఇంక్లూడ్స్ టెక్స్ట్, ఆడియో, వీడియో అండ్ గ్రాఫిక్స్' పేరిట 2019 లో సర్కార్ ఈ ముసాయిదాకు శ్రీకారం చుట్టింది. అంటే ఒకవిధంగా ఇంటర్నెట్, ఆడియో, వీడియోలు కూడా దీని పరిధి కిందకు వచ్చినట్టే ! వివాదాలు మరీ పెద్దగా రేగక ముందే.. ఈ ముసాయిదా బిల్లుకు సంబంధించి కేంద్రం మినిస్టీరియల్, స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరిపిందని, ఆమోదం కోసం కేబినెట్ వరకు వెళ్లకుండానే పార్లమెంటులో సమర్పిస్తారని తెలుస్తోంది. ఇది .. మోడీ సర్కార్ 'మాయ' కాక మరేమిటి ? నేను తలచుకుంటే నా గుప్పిట్లో డిజిటల్ మీడియా కూడా ఉండాల్సిందే అన్న మోడీ నియంతృత్వ విధానాలకు ఇది తాజా నిదర్సనమేనని చెప్పకనే చెబుతోంది. రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్లు, రెగ్యులేషన్లను సరళతరం చేసి డీక్రిమినలైజ్ చేసేయాలని కూడా ఈ బిల్లులో నిర్దేశించారు. సో.. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే ' క్రిమినాలజీ' ఏదీ ఇక ఉండబోదన్నమాట.,

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి.. ఆమోదం పొందే బిల్లుల లిస్టును లోక్ సభ సెక్రటేరియట్ అప్పుడే (నిన్న) విడుదల చేసిందంటే ఎంత హడావుడిగా ఈ బిల్లుపై ముందుకెళ్లాలో బీజేపీ ప్రభుత్వం ముందే నిర్ణయించేసిందన్న మాట ! అన్నట్టు వీటిలో ఈ సంవత్సరపు ప్రెస్ రిజిస్ట్రేషన్ పీరియాడికల్స్ బిల్లు కూడా ఉంది. దీన్ని మోడీ నేతృత్వంలోని కేబినెట్ త్వరలో ఆమోదించవచ్చు. డిజిటల్ మీడియాకున్న భావ ప్రకటనా స్వేచ్చను కంట్రోల్ చేయడానికే ఇలాంటి వ్యవహారాలన్నీ ! కొత్త చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ కోసం డిజిటల్ న్యూస్ మీడియా పబ్లిషర్లు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మొత్తానికి 'కత్తి' పెట్టడం ఇదే మొదటిసారి.. బిల్లు సభ ఆమోదం పొందగానే ఈ మీడియా సైతం సమాచార, మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే సోషల్ మీడియా మీద ఓ కన్నేసి ఉంచిన కేంద్రం.. ఇప్పుడు డిజిటల్ స్వేచ్ఛను కూడా హరించడానికి పూనుకొందంటే.. మళ్ళీ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ వచ్చినట్టే !

Tags:    
Advertisement

Similar News