'బంగ్లా'చొరబాట్లను కట్టడి చేయకుంటే మహిళలకు ముప్పే

ఝార్ఖండ్‌లో జేఎంఎం -కాంగ్రెస్‌ కూటమి పాలనపై ధ్వజమెత్తిన శివరాజ్‌సింగ్‌, హిమంత బిశ్వశర్మ

Advertisement
Update:2024-11-08 21:07 IST

ఝార్ఖండ్‌లోని జేఎంఎం పార్టీ వారసత్వ రాజకీయాలను మాత్రమే విశ్వసిస్తున్నదని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆ పార్టీ నుంచి ఒకే ఒక్క కుటుంబం ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని ఆరోపించారు. ఐదేళ్ల కిందట యువతకు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి.. ఎవరికీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మహిళలు అనేక అవమానాలకు గురవుతున్నారని విమర్శించారు. బంగ్లాదేశ్‌ నుంచి చొరబాటుదారులు ఝార్ఖండ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని.. ఇది రాష్ట్రానికి పెను ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన పలుచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా జేఎంఎం కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు.

అసోం సీఎం హిమంత బిశ్వశర్మ రాంచీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. బీజేపీని గెలుపించుకోండి. లేకపోతే చొరబాటుదారులు ఇళ్లలోకి ప్రవేశించి మహిళలకు ముప్పుగా పరిణమిస్తారని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ హిందువులను విభజించాలని చూస్తున్నదని ఆరోపించారు. ప్రజలు ఐక్యంగా ఉంటేనే అలాంటి యత్నాలను తిప్పికొట్టగలమన్నార. బంగ్లాదేశ్‌ నుంచి పెరుగుతున్న చొరబాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కట్టడి చేయకుంటే రాష్ట్రంలో మహిళలకు ఇది తీవ్ర ముప్పుగా మారుతుందని హచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News