ఒకే అభ్యర్థి కోసం రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి
ఒకే అభ్యర్థి కోసం రెండు శివసేనలు కొట్టుకుంటున్నాయి. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే మృతితో అంధేరి ఈస్ట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలో రమేష్ భార్య రుతుజ లత్కేను తమ తరపున పోటీలోకి దించేందుకు ఉద్దవ్ శివసేన, షిండే శివసేనలు పోటీపడుతున్నాయి.
ముంబైలో జరగబోతున్న ఉపఎన్నికలో రెండు శివసేనలు ఒకే అభర్థి కోసం పోటీ పడుతున్నాయి. ఆ అభ్యర్థి తమ తరపున నిలాబడాలంటే కాదు తమతరపున అంటూ ఇరువర్గాలు రచ్చ చేస్తున్నాయి.
మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్ నియోజకవర్గంలో ఉద్దవ్ ఠాక్ర వర్గానికి చెందిన రమేష్ లత్కే మృతితో ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. ఉద్ధవ సేన తరపున దివంగత రమేష్ భార్య రుతుజ లత్కేకు టిక్కెట్టు ఇచ్చారు. ఆమె బిఎంసి లో ఉద్యోగం చేస్తున్నారు. తనకు టిక్కెట్ రావడంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ, ముఖ్యమంత్రి షిండే వర్గం ఆమెను తమ తరపున పోటీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దాంతో ఆమె రాజీనామాను ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారంటూ ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తోంది. ఈ జాప్యం పై రుతుజ హైకోర్టును ఆశ్రయించారు. తాను ముఖ్యమంత్రి షిండేను కలుసుకోలేదని, తాను ఉద్ధవ్ వర్గం తరుపు మాషాల్ ( కాగడా) గుర్తు పై పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తన భర్త రమేష్ మాదిరే తాను కూడా ఉద్ధవ్ శివసేనకే విధేయురాలిగా ఉంటానని, ఆ గుర్తుపైనే పోటీ చేస్తానని చెప్పారు. ఆమె ఈనెల 14 లోగా నామినేషన్ దాఖలు చేయల్సి ఉంది. కాంగ్రె\స్ ఎన్సీపీలు మద్దతు తెలపడంతో ఉద్దవ్ వర్గం తమ సీటును నిలబెట్టుకోగలదని భావిస్తున్నారు.
రుతుజను తమ వర్గం తరపున పోటీలో దించేందుకు షిండే వర్గం పట్టుదల గా ఉంది. జూన్ నెలలో శివసేన రెండు వర్గాలుగా విడిపోయన తర్వాత షిండే బిజెపి అండతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ఇరు పక్షాలు గెలిచేందుకు పట్టుదలగా ఉన్నాయి. అందుకే ఈ ఉప ఎన్నిక పై అత్యంత ఆసక్తి నెలకొంది.