రూ.100 లంచం.. పట్టించుకోనక్కర్లేదు.. - బాంబే హైకోర్టు

అవినీతి నిరోధక శాఖ అధికారులు అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై 2007లో కేసు నమోదైంది. స్పెషల్‌ కోర్టులో విచారణ కొనసాగగా, 2012లో కోర్టు శిందేను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.

Advertisement
Update:2023-10-06 08:22 IST

వంద రూపాయల లంచం చాలా చిన్న విషయమని, దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని పూణేలో గల పౌడ్‌ గ్రామీణ ఆస్ప‌త్రిలో అనిల్‌ శిందే అనే వ్యక్తి వైద్య సేవలందిస్తున్నారు. స్థానికంగా నివాసముంటున్న ఎలీ పింగై తనపై జరిగిందని, ఈ సందర్భంగా అయిన గాయాలకు వైద్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని శిందే వద్దకు వెళ్లారు. ఇందుకు శిందే రూ.100 లంచం అడగడంతో.. ఎలీ పింగై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు రూ.100 వైద్యుడికి ఇస్తుండగా.. దాడిచేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై 2007లో కేసు నమోదైంది. స్పెషల్‌ కోర్టులో విచారణ కొనసాగగా, 2012లో కోర్టు శిందేను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును హైకోర్టులో సవాల్‌ చేసింది. విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. రూ.100 లంచం తీసుకోవడం చాలా చిన్న విషయమని పేర్కొంది. స్పెషల్‌ కోర్టు తీర్పును సమర్థిస్తూ అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల మేరకు నిందితుడిని నిర్దోషిగా పరిగణిస్తున్నామని ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News