కాంగ్రెస్ లో చేరిన బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్

శెట్టర్ ఈ ఉదయం బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

Advertisement
Update:2023-04-17 12:26 IST

నిన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి రాజీనామా చేసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ సోమవారం కాంగ్రెస్‌లో చేరారు.

శెట్టర్ ఈ ఉదయం బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. 'జగదీష్‌ శెట్టర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేరిక కాంగ్రెస్‌లో ఉత్సాహాన్ని పెంచుతుంది, ఆయన ఒంటరిగా గెలవడమే కాదు, ఎక్కువ సీట్లు గెలిపించే సత్తా ఉన్న వ్యక్తి. ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘ్ లలో ఉన్నప్పటికీ ఆయన వివాదరహితుడు. మేమిద్దరం కలిసి పనిచేశాం.మా లక్ష్యం 150 సీట్లు, షెట్టర్ చేరిన తర్వాత మేము ఆ లక్ష్యాన్ని చేరుకోవడం మరింత సులభమయ్యింది.'' అన్నారు.

“జగదీష్ శెట్టర్ నుండి ఎటువంటి డిమాండ్లు లేవు. మేము ఏమీ హామీలివ్వలేదు. ఆయన (జగదీష్ శెట్టర్) కాంగ్రెస్ పార్టీ సూత్రాలు, నాయకత్వానికి అనుగుణంగా పని చేస్తారు. మేము దేశాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటున్నాము. కాంగ్రెస్ మాత్రమే అది చేయగలదు, ”అని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ అన్నారు.

ఆదివారం బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత మాజీ సీఎం శెట్టర్ ను కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ బెంగళూరులో కలిశారు.

ఈ విషయమై జగదీష్ శెట్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, “గత కొన్ని రోజులుగా రాజకీయ పరిణామాలతో విసిగిపోయి, నేను నా ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేశాను. నా తదుపరి కార్యాచరణను కార్యకర్తలతో చర్చిస్తాను. ఎప్పటిలాగే మీ ప్రేమ, ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నాను”.అన్నారు

జగదీశ్ శెట్టర్‌కు అవమానం జరిగిందని, బీజేపీ పేకమేడలా కూలిపోయిందని కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా ఆదివారం అన్నారు.

కాగా, ఢిల్లీలో శెట్టర్ కు పెద్ద పదవి ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.

“జగదీష్ శెట్టర్ కర్నాటక‌లో సీనియర్, ముఖ్యమైన నాయకుడు. శెట్టర్ కు ఢిల్లీలో పెద్ద పదవి ఇస్తామని జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. హెట్టర్ పార్టీలో కొనసాగితే అంతా బాగానే ఉండేది'' అని బొమ్మై మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఇదిలా ఉండగా, శెట్టర్ తిరిగి బీజేపీలోకి వస్తే, పార్టీ ఆయనకు స్వాగతం పలుకుతుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు.

Tags:    
Advertisement

Similar News