మా ప్రభుత్వంపై బీజేపీ, జేడీఎస్‌ కుట్రలు చేస్తున్నయ్‌

కోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించాక స్పందిస్తా : కర్నాటక సీఎం సిద్ధరామయ్య

Advertisement
Update:2024-09-24 18:33 IST

కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డబ్బులు వెదజల్లి కూల్చేయాలని బీజేపీ అనేక ప్రయత్నాలు చేసిందని, అవి సక్సెస్‌ కాకపోవడంతోనే జేడీఎస్‌ తో కలిసి కమలం పార్టీ తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తోందని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ముడా స్కామ్‌ లో తన ప్రాసిక్యూషన్‌ కు గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ కర్నాటక హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో మంగళవారం బెంగళూరులో ఆయన స్పందించారు. కోర్టు తీర్పు విషయాన్ని తాను మీడియాలోనే చూశానని, జడ్జిమెంట్‌ కాపీని ఇంకా చూడలేదని తెలిపారు. జడ్జిమెంట్‌ పై లీగల్‌ టీమ్‌ తో చర్చించిన తర్వాత రాజకీయంగా, న్యాయపరంగా స్పందిస్తానని తెలిపారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌, తన కేబినెట్‌ సహచరులతోనూ తీర్పుపై చర్చించాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే ఈ వ్యవహారంపై రియాక్ట్‌ అవుతానని పేర్కొన్నారు. ముడా స్కాంలో విచారణ ఎదుర్కోబోతున్న సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు మద్దతుగా ఉన్నా పలువురు కన్నడ నేతలు సీఎం మార్పు ఉంటే తమకు చాన్స్‌ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News