చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది - సీతారాం ఏచూరి
సెప్టంబర్ 17 న తెలంగాణ విమోచన జరగలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్ విలీన చరిత్రను భారతీయ జనతా పార్టీ వక్రీకరిస్తున్నదని ఆయన ఆరోపించారు.
Advertisement
సెప్టంబర్ 17 రోజు తెలంగాణ విమోచన దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. హైదరాబాద్ రాజ్యం విలీన చరిత్రను భారతీయ జనతా పార్టీ వక్రీకరిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టంబర్ 17 గురించి పోలిట్ బ్యూరోలో కూడా చర్చించామని ఏచూరి తెలిపారు.
కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వల్లనే నిజాం నవాబు పతనం ప్రారంభమైందని, పూర్తిగా బలహీనపడిపోయాడని, పోలీసు యాక్షన్ ద్వారా లొంగిపోయారని ఏచూరి తెలిపారు. ఇది విమోచనం కాదని, బీజేపీ, ఆరెస్సెస్ లు దీనిని విమోచన గా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఏచూరి అన్నారు. తాము సెప్టంబర్ 17 న తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటామని ఆయన అన్నారు.
Advertisement