మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్!
ఖరారు చేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం
Advertisement
మహా ఉత్కంఠకు బీజేపీ కేంద్ర నాయకత్వం తెరదించింది. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నే ఖరారు చేసింది. సీఎం పదవిపై శివసేన నేత ఏక్ నాథ్ షిండే ఆశలు పెట్టుకున్నా, మోదీ, అమిత్ షా ద్వయం ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపినట్టు ఢిల్లీ బీజేపీ నాయకత్వం నుంచి లీకులు ఇచ్చారు. ఈనెల 5న ఆజాద్ మైదాన్ లో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఫడ్నవీస్ ను సీఎం చేస్తే షిండే ఏం చేయబోతున్నారు, మరాఠాలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Advertisement