ఎన్నికల కోసం మళ్ళీ రామమందిరం, సర్జికల్ స్ట్రైక్స్ జపం మొదలు పెట్టిన‌ బీజేపీ

త్రిపురలో కొద్ది రోజుల్లో శాసన సభ ఎన్నికలున్నాయి. అక్కడ హిందుత్వ కార్డ్ ఆధారంగానే గతంలో కూడా సీపీఎం ను ఓడించింది బీజేపీ. ఇప్పుడు కూడా అదే కార్డ్ ఉపయోగించాలనుకుంటోంది. అందులో భాగంగానే ఈ రోజు బీజేపీ అగ్రనేత అమిత్ షా మాటలున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం, పాక్ పై సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రసంగించారు.

Advertisement
Update:2023-01-05 21:19 IST

అయోధ్యలో రామమందిరం అనే నినాదం బీజేపీకి అనేక ఏళ్ళుగా ఓట్లు కురిపిస్తూనే ఉంది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత రామ మందిర‍ం నిర్మాణం ప్రారంభమవడంతో ఇక బీజెపి ఓట్ల కోసం రామ మందిరాన్ని ఉపయోగించుకోదు కాబోలని చాలా మంది భావించారు. చాలా మంది అనుకున్నట్టే బీజేపీ లవ్ జీహాదీ వంటి కొత్త నినాదాలు ఎత్తుకుంది. అయితే ఎన్ని కొత్త నినాదాలు ఇచ్చినా రామ మందిరం అంత పవర్ ఫుల్ నినాదం మరేది ఉండబోదన్నది బీజేపీకి బాగా తెలుసు. అందుకే మళ్ళీ ఆ జపమే మొదలు పెట్టింది.

త్రిపురలో కొద్ది రోజుల్లో శాసన సభ ఎన్నికలున్నాయి. అక్కడ హిందుత్వ కార్డ్ ఆధారంగానే గతంలో కూడా సీపీఎం ను ఓడించింది బీజేపీ. ఇప్పుడు కూడా అదే కార్డ్ ఉపయోగించాలనుకుంటోంది. అందులో భాగంగానే ఈ రోజు బీజేపీ అగ్రనేత అమిత్ షా మాటలున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం, పాక్ పై సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రసంగించారు.

ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, ఆలయ నిర్మాణాన్ని కాంగ్రెస్, సీపీఐ(ఎం) అడ్డుకున్నాయని, ఈ సమస్యను చాలా కాలం పాటు కోర్టులో నానేట్టు చేశారని అన్నారు. మోడీ వచ్చాకే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. అని ఆయన అన్నారు.

2024 జనవరి1 న అయోధ్యలో రాముడి ఆలయాన్ని ప్రారంభించనున్నట్టు అమిత్ షా ప్రకటించారు.

"రాహుల్ బాబా, వినండి, జనవరి 1, 2024న రామమందిరం ప్రారంభమవుతుంది" అని అమిత్ షా అన్నారు.

ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో పర్యటనను ప్రారంభించిన షా గురువారం రాష్ట్రంలో పార్టీ మొదటి ఎన్నికల రథయాత్రను జెండా ఊపిప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోడీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందన్నారు. "కాశ్మీర్‌లో పుల్వామా ఘటన జరిగిన పది రోజుల తర్వాత, భారత సైనికులు పాకిస్తాన్‌లోకి వెళ్లి మోడీ నాయకత్వంలో విజయవంతమైన ఆపరేషన్ చేసారు" అని షా అన్నారు.

ఈ రోజు అమిత్ షా ప్రసంగాన్ని బట్టి ఈ ఏడాది జరగనున్న అనేక రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో, 2024 లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ రామమందిరం, సర్జికల్ స్ట్రైక్స్ లను వాడుకుంటుందనేది స్పష్టమవుతోంది. 


Tags:    
Advertisement

Similar News