4రోజుల క్రితం ప్రధాని ప్రారంభించిన మెట్రో స్టేషన్, చిన్న వర్షానికే నీళ్ళతో నిండి పోయింది.

బెంగళూరులో మొన్న రాత్రి,నిన్న కురిసిన వర్షాలకు నల్లూర్హల్లి మెట్రో స్టేషన్ నీటిలో మునిగిపోయింది. స్టేషన్ లోపలికి ప్రవేశించిన నీరు ప్లాట్‌ఫామ్ లను, టికెటింగ్ కౌంటర్ లను ముంచేసింది.

Advertisement
Update:2023-04-06 13:56 IST

బీజేపీ పాలిత కర్నాటకలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల క్రితం ప్రారంభించిన మెట్రో స్టేషన్ నిన్న కురిసిన వానకు నీళ్ళలో మునిగిపోయింది.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుండి కృష్ణరాజపురం వరకు నడిచే కొత్త మెట్రో లైన్ శనివారం ప్రధాని ప్రారంభించారు. 4,249 కోట్ల వ్యయంతో, 13.71 కిలోమీటర్ల దీనిని నిర్మించారు.

అయితే బెంగళూరులో మొన్న రాత్రి,నిన్న కురిసిన వర్షాలకు నల్లూర్హల్లి మెట్రో స్టేషన్ నీటిలో మునిగిపోయింది. స్టేషన్ లోపలికి ప్రవేశించిన నీరు ప్లాట్‌ఫామ్ లను, టికెటింగ్ కౌంటర్ లను ముంచేసింది.

నీళ్ళతో మునిగిన స్టేషన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టేషన్లను సరిగా నిర్మించకుండానే, మౌలిక సదుపాయాలు కల్పించకుండానే, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ లైన్ ను ఆదరాబాదరా ప్రారంభించిందని ప్రయాణీకులు మండిపడుతున్నారు.

తేలికపాటి వర్షాలకే ఈ పరిద్థితి ఎదురైతే ఇక‌ వర్షాకాలంలో పరిస్థితి ఏంటి ? అని ట్విట్టర్ లో ఓ నెటిజన్ ప్రశ్నించారు.

పనులు పూర్తి చేయకుండానే ఆత్రుతగా మెట్రో స్టేషన్లను ప్రారంభిస్తే ఇంతకన్నా ఏమి ఆశిస్తాము అని మరో నెటిజన్ దుయ్యబట్టారు.

Tags:    
Advertisement

Similar News