నుహ్ లో తగ్గని వేడి.. ఇంటర్నెట్ పై నిషేధం పొడిగింపు

మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగిస్తున్నారు పోలీసులు. ఆగస్ట్ 13 అర్థరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ నిషేధంతో పాటు, ఎస్ఎంఎస్ ల సేవలు కూడా పౌరులకు అందుబాటులో ఉండవని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ ప్రకటన విడుదల చేశారు.

Advertisement
Update:2023-08-12 11:51 IST

160 ఎఫ్ఐఆర్ లు

393 మంది అరెస్ట్

118 మంది ముందస్తు నిర్బంధం..

ఇదీ ప్రస్తుతం హర్యానాలో పరిస్థితి. హర్యానాలో హింసాత్మక ఘటనల ప్రభావం ఇంకా తగ్గలేదు. ఎప్పుడు ఏవైపు నుంచి ఆందోళనకారులు దూసుకొస్తారో అని ప్రజలు వణికిపోతున్నారు. నుహ్ జిల్లాతోపాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్, రెవారీ, పానిపట్, భివానీ, హిసార్‌ లో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగిస్తున్నారు పోలీసులు. ఆగస్ట్ 13 అర్థరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ నిషేధంతో పాటు, ఎస్ఎంఎస్ ల సేవలు కూడా పౌరులకు అందుబాటులో ఉండవని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ ప్రకటన విడుదల చేశారు.

ప్రతిపక్షాల ఆందోళన..

ఇటీవల పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మణిపూర్ ఆందోళనలతోపాటు, హర్యానా గొడవలపై కూడా చర్చ జరిగింది. హర్యానాలో కూడా బీజేపీ డబుల్ ఇంజిన్ వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. పరిస్థితులను అదుపులోకి తేవడం బీజేపీకి సాధ్యం కావడంలేదని అన్నారాయన.

గురుగ్రామ్ లో స్కూల్స్ ప్రారంభం..

గురు గ్రామ్ లో స్కూల్స్ ని తిరిగి ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈరోజు నుంచి రోజులో 11గంటలసేపు కర్ఫ్యూ సడలిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రజల రాకపోకలపై నిషేధం తొలగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

మళ్లీ అల్లర్లకు అవకాశం..!

హర్యానాలో మళ్లీ అల్లర్లకు అవకాశం ఉంటుందనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అల‌ర్ట్‌గానే ఉన్నారు. అందుకే ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆంక్షలు తొలగించే విషయంలో ఆచతూచి నిర్ణయం తీసుకుంటోంది. 

Tags:    
Advertisement

Similar News