ఎట్టకేలకు చిక్కిన చిరుత

యూపీలో బహ్రెయిచ్‌లో మనుషుల ప్రాణాలు తీస్తున్న చిరుతను బంధించిన అటవీ అధికారులు

Advertisement
Update:2024-10-01 08:58 IST

యూపీలో బహ్రెయిచ్‌లో మనుషుల ప్రాణాలు తీస్తున్న చిరుత పులి ఎట్టకేలకు చిక్కింది. కతర్నియా ఘాట్‌లోని ధర్మాపూర్‌ బోఝా గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత చిక్కుకున్నదని అటవీ అధికారులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పలుచోట్ల బోన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బంధించిన చిరుతను సురక్షిత ప్రాంతానికి తరలించారు.ఇటీవల బహ్రెయిచ్‌లోలోని ఓ గ్రామంలో 40 ఏండ్ల రైతును చిరుత చంపేయడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాన్ని పట్టుకోవడానికి అటవీ అధికారులు తీవ్రంగా శ్రమించారు.

మరోవైపు ఈఏడాది మార్చి నుంచి బహ్రెయిచ్‌లోని పలు గ్రామాల్లో ఆరు తోడేళ్లు చేసిన దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. వాటిలో ఐదింటిని అటవీ అధికారులు ఇప్పటికే బంధించారు. మిగిలిన తోడేలు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News