మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ షురూ

యూపీలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు నేడు పోలింగ్‌. సాయంత్రం 6 తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు

Advertisement
Update:2024-11-20 08:57 IST

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మహారాష్ట్రలో నేడు ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతున్నది. మరోవైపు ఝార్ఖండ్‌లో రెండో విడతలో భాగంగా 38 నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు యూపీలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 23న వీటికి సంబంధించిన కౌంటింగ్‌ జరగనున్నది. మహారాష్ట్రలో 288 స్థానాల్లో 4,136 మంది అభ్యర్థులు.. ఝార్ఖండ్‌లో 38 స్థానాలకు 528 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిండే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) లమహాయుతి కూటమి .. కాంగ్రెస్‌, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌పవార్‌)ల మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) మధ్య పోటీ ఉన్నది. మహాయుతిలో బీజేపీ 149, శివసేన 81, ఎన్పీసీ 59 చోట్ల పోటీ ఉండగా.. ఎంవీఏలోని కాంగ్రె్‌ 101, శివసేన 95, ఎన్సీపీ 86 చోట్ల తలపడుతున్నాయి. 

సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్నది. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రెండు రాష్ట్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేయవచ్చు. నవంబర్ 20 సాయంత్రం 6.30 నుండి మహారాష్ట్ర మరియు జార్ఖండ్ రెండింటికీ పోల్‌స్టర్‌లు, మీడియా సంస్థలు తమ అంచనాలను ప్రసారం చేయవచ్చు.

ఝార్ఖండ్‌లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్నది. ఝార్ఖండ్‌లో 1.23 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఝార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ స్థానాలున్నాయి. మహారాష్ట్రలో 31 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరగనున్నది.

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ నాగ్‌పూర్‌లో ఓటు వేయడగా.. రాజ్‌భవన్‌ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఓటు వేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ బారామతిలో, ముంబయి బీజేపీ అధ్యక్షుడు అశీష్‌ షెలార్‌ బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్‌కుమార్‌ రావు, కబీర్‌ఖాన్‌ సహా బాలీవుడ్‌ ప్రముఖులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

Advertisement

Similar News