చట్టాన్ని గౌరవించే పౌరులుగా సంస్థ‌ను ర‌ద్దు చేస్తున్నాం : పిఎఫ్ఐ వెల్ల‌డి

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ ఐ)ను, దాని అనుబంధ సంస్థలను రద్దు చేస్తున్నామని ఆ సంస్థ కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. దేశంలోని చట్టాన్ని గౌరవించే పౌరులుగా, మేము హోం మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Update:2022-09-28 19:36 IST

కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ ఐ), దాని అనుబంధ సంస్థలను నిషేధించిన నేపథ్యంలో త‌మ సంస్థ‌ను రద్దు చేస్తున్న‌ట్టు పిఎఫ్ఐ బుధ‌వారం ప్రకటించింది. హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) పిఎఫ్ఐ ని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో సంస్థను రద్దు చేసినట్లు పిఎఫ్‌ఐ కేరళ‌  ప్రధాన కార్యదర్శి ఎ. అబ్దుల్ సత్తార్ ఒక ప్రకటనలో తెలిపారు. "దేశంలోని చట్టాన్ని గౌరవించే పౌరులుగా, మేము హోం మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాము." అని పేర్కొన్నారు.

"పిఎఫ్ఐ గత మూడు దశాబ్దాలుగా సమాజంలోని అణగారిన, అట్టడుగు వర్గాల సామాజిక,ఆర్థిక సాంస్కృతిక సాధికారత కోసం స్పష్టమైన దృష్టితో పని చేస్తోంది. కానీ మన గొప్ప దేశం లోని చట్టాన్ని గౌరవించే పౌరులుగా, సంస్థ హోం మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని ఆమోదిస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రద్దు చేయబడిందని దాని మాజీ సభ్యులందరికీ. సాధారణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలోని సభ్యులందరూ తమ కార్యకలాపాలను నిలిపివేయవలసిందిగా అభ్యర్థించాము" అని ఆయన పేర్కొన్నారు.

కాగా, పిఎఫ్‌ఐ అతివాద దృక్పథాలను తాము వ్యతిరేకిస్తున్నామని, అయితే ఉగ్రవాద వ్యతిరేక చట్టం యుఎపిఎ కింద ఆ సంస్థను నిషేధించడం ద్వారా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు మద్దతు ఇవ్వడం లేదని సిపిఐ(ఎం) బుధవారం తెలిపింది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఇది స‌రైన విధానం కాద‌ని వ్యాఖ్యానించింది. 

Tags:    
Advertisement

Similar News