సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. సీఈసీ ప్రకటన
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు విలేకర్లతో మాట్లాడారు. లోక్‌సభతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ప్రకటించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చని నిన్న కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ప్రకటించారు. ఈరోజు కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) కూడా ఇదే రీతిలో ప్రకటన చేసింది. ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు విలేకర్లతో మాట్లాడారు. లోక్‌సభతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ప్రకటించారు.
2024 ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారు.