సినిమా హాలులో హనుమంతుడికి స్పెషల్ సీటు

సెంటిమెంట్ అనుకోండి, ఇదోరకమైన ప్రచారం అనుకోండి.. ఆదిపురుష్ సినిమా ఆడే థియేటర్లలో మాత్రం ఒకసీటు ఖాళీగా ఉంచడం మాత్రం ఖాయం. ఈ సినిమాలో దేవదత్త నాగె హనుమంతుడి పాత్రలో నటించారు.

Advertisement
Update:2023-06-06 16:38 IST

దేవుళ్ల సినిమాలు విడుదలైనప్పుడు సినిమా హాల్ ప్రాంగణంలో చిన్న చిన్న గుడుల సెటప్ పెట్టడం, పాము సినిమాలు రిలీజైనప్పుడు పాముల పుట్టలు డెకరేట్ చేయడం, వీటితోపాటు ఓ హుండీ పెట్టడం అప్పట్లో ఓ ట్రెండ్. మల్టీప్లెక్స్ సంస్కృతి వచ్చిన తర్వాత ఇలాంటివి కాస్త తగ్గాయి. మళ్లీ ఇప్పుడు ఆ ట్రెండ్ మొదలయ్యేలా కనిపిస్తోంది. ఆదిపురుష్ సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ఆసక్తిర విషయం చెప్పింది. ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లోనూ ఓ సీటుని హనుమంతుడికోసం రిజర్వ్ చేసి ఉంచుతామంటోంది.

అందుకే ఆ సెంటిమెంట్..

శ్రీరాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడనే నమ్మకం ఉంది. రామనామ పారాయణం జరిగే చోటుకి ఆంజనేయుడు కచ్చితంగా వస్తాడని అంటారు. అలా ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే ప్రతి చోటకు ఆంజనేయుడు వస్తాడని, అందుకే ఆయనకోసం సినిమా హాల్ లో ఓ సీటు రిజర్వ్ చేసి ఉంచుతామంటున్నారు. సెంటిమెంట్ అనుకోండి, ఇదోరకమైన ప్రచారం అనుకోండి.. ఆదిపురుష్ సినిమా ఆడే థియేటర్లలో మాత్రం ఒకసీటు ఖాళీగా ఉంచడం మాత్రం ఖాయం. ఈ సినిమాలో దేవదత్త నాగె హనుమంతుడి పాత్రలో నటించారు.

శ్రీరాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఓంరౌత్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. 

Tags:    
Advertisement

Similar News