అజిత్ పవార్ పార్టీలో చేరిన నటుడు సయాజీ షిండే
ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయ రంగప్రవేశం చేశారు. ఇవాళ అజిత్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయ రంగప్రవేశం చేశారు. ఇవాళ అజిత్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్వయంగా కండువా కప్పి షిండేను పార్టీలోకి ఆహ్వానించారు. మరో కోన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2021 శాసన సభ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీజేపీ శివసేన, ఎన్సీపీని చీల్చి ప్రభుత్వాన్ని కొలువుదీర్చింది.
ఏక్‌నాథ్ షిండే శివసేన నుంచి 42 మంది ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ పంచెన చేరి ముఖ్యమంత్రి కాగా, అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి 8 మందిని చీల్చి ప్రభుత్వంలో డీప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నాడు. బీజేపీ చీలిక నేతలకు పదవుల ఆశచూసి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర అధికార కూటమి 'మహాయుతి'లో మరోసారి విభేదాలు చెలరేగాయి. సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గం మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరడం లేదు