రూ.2000 కరెన్సీ నోట్లను ర‌ద్దు చేయండి - పార్లమె‍ంటులో బీజేపీ ఎంపీ డిమా‍ండ్

2,000 నోట్లను నిల్వ చేస్తూ డ్రగ్స్, మనీలాండరింగ్ వంటి అక్రమ వ్యాపారాల్లో తరచుగా వాటిని ఉపయోగిస్తున్నారని మోడీ పేర్కొనారు. దేశంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన 2000 రూపాయల నోటు నల్లధనానికి పర్యాయపదంగా మారిందని ఆయన అన్నారు.

Advertisement
Update:2022-12-12 19:33 IST

రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను దశలవారీగా రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ సోమవారం (డిసెంబర్ 12) డిమాండ్ చేశారు, అలాంటి నోట్లను ఉన్నవారు వాటిని డిపాజిట్ చేయడానికి రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరారు. రాజ్యసభలో జీరో-అవర్ లో ఆయ‌న ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలోని చాలా ఎటిఎంలలో రూ. 2,000 నోట్లు మాయమయ్యాయని, అవి త్వరలో చట్టబద్ధం కాకపోవచ్చునని పుకార్లు ఉన్నాయని అన్నారు.

మూడేళ్ల క్రితమే 2000 రూపాయల కరెన్సీ నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసింది. ప్రభుత్వం రాత్రికి రాత్రే పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో రూ.2000 కరెన్సీ నోటుతోపాటు కొత్త 500 రూపాయల నోటును ప్రవేశపెట్టారు.

"1,000 రూపాయల నోటు చలామణిని నిలిపివేసి 2,000 రూపాయల నోటు తీసుకురావడంలో ఎటువంటి లాజిక్ లేదు. అమెరికా, జ‌పాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లు లేవు" అని సుశీల్ కుమార్ మోడీ ఉదహరించారు.

2,000 నోట్లను నిల్వ చేస్తూ డ్రగ్స్, మనీలాండరింగ్ వంటి అక్రమ వ్యాపారాల్లో తరచుగా వాటిని ఉపయోగిస్తున్నారని మోడీ పేర్కొనారు. దేశంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన 2000 రూపాయల నోటు నల్లధనానికి పర్యాయపదంగా మారిందని ఆయన అన్నారు.

Tags:    
Advertisement

Similar News