ఆ పని చేయకపోతే మీ పాన్ కార్డ్ చెల్లుబాటు కాదు..

Aadhar link to PAN card: ఆర్థిక లావాదేవీలన్నీ పాన్ తో ముడిపడి ఉంటాయి. సో.. పాన్ కార్డ్ ని ఆధార్ తో లింకు చేస్తే ఆ సమాచారమంతా ఆధార్ కి కూడా లింక్ అవుతుంది. అందుకే ప్రభుత్వాలు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని చెబుతున్నాయి.

Advertisement
Update:2022-12-24 17:40 IST

Aadhar link to PAN card: ఆ పని చేయకపోతే మీ పాన్ కార్డ్ చెల్లుబాటు కాదు..

వచ్చే ఏడాది మార్చి 31 లోగా ఆధార్ కార్డ్ తో పాన్ కార్డ్ అనుసంధానం చేసుకోకపోతే పాన్ కార్డ్ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది కేంద్రం. గతంలో ఇలాంటి హెచ్చరికలే పలుమార్లు జారీ చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పాన్-ఆధార్ అనుసంధానం గడువు పొడిగించుకుంటూ వచ్చింది. చివరకు 2023 మార్చి 31ని డెడ్ లైన్ గా ప్రకటించింది. ఆలోగా పాన్, ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే ఏప్రిల్-1 నుంచి అలాంటి పాన్ కార్డ్ లు చెల్లుబాటు కావని తేల్చేసింది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, మినహాయింపు వర్గం పరిధిలోకి రాని పాన్ కార్డ్ హోల్డర్లు అందరూ 2023 మార్చ్ 31 లోగా తమ పాన్‌ ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది.

ఎందుకీ అనుసంధానం..?

ప్రస్తుతం దేశంలో సంక్షేమ పథకాలన్నిటికీ ఆధార్ కీలకంగా మారింది. ఆధార్ కార్డ్ నెంబర్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే చాలామంది ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లు కూడా సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు. అంటే ప్రభుత్వానికి వారి గురించి తగిన సమాచారం లేదు. ఆధార్ ద్వారా ట్యాక్స్ వ్యవహారాలు తెలియవు కాబట్టి సంక్షేమ పథకాలకు ఢోకా లేకుండా పోతోంది. పెద్ద మొత్తంలో బంగారం కొన్నా, స్థలాలు, పొలాల క్రయ విక్రయాలయినా, వాహనాల కొనుగోళ్లకయినా ఆధార్ కంటే పాన్ ఎక్కువగా అవసరం. అంటే ఆర్థిక లావాదేవీలన్నీ పాన్ తో ముడిపడి ఉంటాయి. సో.. పాన్ కార్డ్ ని ఆధార్ తో లింకు చేస్తే ఆ సమాచారమంతా ఆధార్ కి కూడా లింక్ అవుతుంది. అందుకే ప్రభుత్వాలు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని చెబుతున్నాయి.

ప్రజలు మాత్రం ఈ రెండూ కలిపేస్తే తమకి అందుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయేమోనని భయపడుతున్నారు. పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోడానికి వెనకాడుతున్నారు. కేంద్రం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా పెడచెవిన పెడుతున్నారు. దీంతో అనివార్యంగా గడువు పెంచుకుంటూ పోతోంది కేంద్రం. ఆమధ్య గడువుని 2023 మార్చ్-31 వరకు పొడిగించింది. దీన్ని కూడా ప్రజలు లైట్ తీసుకునే అవకాశం ఉందని తేలడంతో ఈసారి కాస్త గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. ఆధార్ తో అనుసంధానించకపోతే పాన్ చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది.

Tags:    
Advertisement

Similar News