‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్' అంటూ మహారాష్ట్ర పల్లెల్లో ప్రచారం చేస్తున్న జానపద కళాకారుడు

కేసీఆర్ ఇచ్చిన నినాదపు స్పూర్తితో ఓ జానపదకళాకారుడు తన టీంతో కలిసి ఊరూరా తిరుగుతూ కిసాన్‌ సర్కార్‌ రావాల్సిన అవసరాన్ని ప్రచారం చేస్తున్నాడు. గ్రామాల్లో భజనలు చేస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ తిరిగే ఆ కీర్తనకారుడు ప్రస్తుతం తెలంగాణతో పోల్చి మహారాష్ట్ర వెనుకబాటును ప్రశ్నిస్తూ పాటలు పాడుతున్నాడు.

Advertisement
Update:2023-04-01 11:16 IST

భారత రాష్ట్ర సమితి ఏర్పడ్డ తర్వాత ఆ పార్టీ ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్' అంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. ఈ మధ్య కాలంలో బీఆరెస్ అద్వర్యంలో మహారాష్ట్రలోని నాందేడ్‌, లోహాలో జరిగిన రెండు భారీ బహిరంగసభల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. ఈ నినాదంపై మరాఠ్వాడ ప్రాంతంలోని పల్లెల్లో విస్తృత చర్చ జరుగుతున్నదని బీఆరెస్ నేతలు చెప్తున్నారు.

కేసీఆర్ ఇచ్చిన ఆ నినాదపు స్పూర్తితో ఓ జానపదకళాకారుడు తన టీంతో కలిసి ఊరూరా తిరుగుతూ కిసాన్‌ సర్కార్‌ రావాల్సిన అవసరాన్ని ప్రచారం చేస్తున్నాడు. గ్రామాల్లో భజనలు చేస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ తిరిగే ఆ కీర్తనకారుడు ప్రస్తుతం తెలంగాణతో పోల్చి మహారాష్ట్ర వెనుకబాటును ప్రశ్నిస్తూ పాటలు పాడుతున్నాడు.

''మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాలను అద్భుతంగా మార్చినట్టుగా మహా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయదు?'' అని ఆయన తన కీర్తనల ద్వారా ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్రలో రైతుల దుస్థితికి బీజేపీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, శివసేన తదితర పార్టీలే కారణమని, ఈ సారి మనం రైతుల సంక్షేమం గురించి ఆలోచించే, రైతుల కోసం పనిచేసే సర్కారును ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News