మూడోసారి కూడా ఆడబిడ్డ.. నోట్లో పొగాకు కుక్కి చంపిన తండ్రి

జననాన్ని నమోదు చేసుకునేందుకు కోసం ఆశ కార్యకర్త గోకుల్ ఇంటికి వెళ్ళింది. చిన్నారి ఎక్కడా? అని కుటుంబ సభ్యులను అడిగింది. చనిపోయినట్లు కుటుంబ సభ్యులు సమాధానం ఇవ్వడంతో వారి తీరుపై ఆశ కార్యకర్తకు అనుమానం వచ్చింది.

Advertisement
Update:2023-09-15 11:56 IST

తరాలు మారుతున్నా ఆడపిల్లలపై వివక్ష మాత్రం తగ్గడం లేదు. ఆడబిడ్డ పుడితే నిర్దాక్షిణ్యంగా చంపే మూర్ఖ‌పు తల్లిదండ్రులు ఇంకా సమాజంలో కనిపిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఇటువంటి ఘటనే జరిగింది. మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందనే కోపంతో కన్న తండ్రి పసి పాపను చంపేశాడు. మహారాష్ట్రలో పహూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్ తండాలో గోకుల్ జాదవ్ (30) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఇటీవల గోకుల్ భార్యకు మూడో కాన్పులో కూడా ఆడబిడ్డ పుట్టింది.

మగ బిడ్డ పుడతాడని ఎదురుచూసిన గోకుల్.. మూడోసారి కూడా ఆడబిడ్డ జన్మించడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. పసిబిడ్డ అని కూడా చూడకుండా నోట్లో పొగాకు కుక్కి హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా చిన్నారి మృతదేహాన్ని పాతిపెట్టాడు.

ఇదిలా ఉండగా.. జననాన్ని నమోదు చేసుకునేందుకు కోసం ఆశ కార్యకర్త గోకుల్ ఇంటికి వెళ్ళింది. చిన్నారి ఎక్కడా? అని కుటుంబ సభ్యులను అడిగింది. చనిపోయినట్లు కుటుంబ సభ్యులు సమాధానం ఇవ్వడంతో వారి తీరుపై ఆశ కార్యకర్తకు అనుమానం వచ్చింది.

విషయాన్ని ఆమె పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళింది. పోలీసులు గోకుల్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. మూడోసారి కూడా ఆడబిడ్డ పుట్టడంతో తానే తన కుమార్తెను హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు గోకుల్ పై కేసు నమోదు చేసి చిన్నారిని పాతిపెట్టిన స్థలం నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపారు.

Tags:    
Advertisement

Similar News