కేదార్ నాథ్ లో ఘోరం.. హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు దుర్మరణం..

గుప్త్ కాశీ నుంచి కేదార్ నాథ్ కు యాత్రికులతో హెలికాప్టర్ బయలుదేరింది. కేవలం 2 కిలోమీటర్లే దూరం ఉన్నా.. అక్కడ రవాణా సౌకర్యాలు సరిగా అందుబాటులో ఉండకపోవడంతో యాత్రికులు హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు.

Advertisement
Update:2022-10-18 15:39 IST

కేదార్ నాథ్ యాత్రలో ఘోరం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ కొండలోయలో కుప్పకూలింది. కేదార్ నాథ్ ఆలయానికి 2కిలోమీటర్ల దూరంలోని గరుడ్ చట్టీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్ సహా ఏడుగురు దుర్మరణం చెందారు.

గతంలో వరదల కారణంగా కేదార్ నాథ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ లో తెలుగు రాష్ట్రాల యాత్రికులు కూడా వరదల్లో చిక్కుకుపోయిన సంఘటనలు జరిగాయి. ఇటీవల కాలంలో ఇలా హెలికాప్టర్ కుప్పకూలి యాత్రికులు దుర్మరణం పాలవడం మాత్రం ఇదే తొలిసారి. హెలికాప్టర్ తునాతునకలైంది. దీంతో పైలట్ సహా ఏడుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఉత్తరాఖండ్ లోని గరుడ్ చట్టీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మరో 2కిలోమీటర్లు వెళ్తే యాత్రికులు గమ్యస్థానానికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగింది.

గుప్త్ కాశీ నుంచి కేదార్ నాథ్ కు యాత్రికులతో హెలికాప్టర్ బయలుదేరింది. కేవలం 2 కిలోమీటర్లే దూరం ఉన్నా.. అక్కడ రవాణా సౌకర్యాలు సరిగా అందుబాటులో ఉండకపోవడంతో యాత్రికులు హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో హెలికాప్టర్ పైలట్ తోపాటు ఆరుగురు ప్రయాణికులు అందులో ఉన్నారు. వారంతా చనిపోయారు.

కారణం ఏంటి..

దట్టంగా మంచు కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News