మణిపూర్‌ కు 50 కంపెనీల బలగాలు!

మణిపూర్‌ లో తాజా పరిస్థితులపై సమీక్షించిన అమిత్‌ షా

Advertisement
Update:2024-11-18 20:17 IST

మణిపూర్‌ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ సాధారణ పరిస్థితి తీసుకువచ్చేందుకు అదనపు బలగాలు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మణిపూర్‌ లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆదివారమే కేంద్ర హోం మంత్రి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకొని ఢిల్లీకి తిరిగి వచ్చేశారు. మణిపూర్‌ పరిస్థితిపై వరుసగా రెండో రోజు ఆయన అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మణిపూర్‌లో పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చేందుకు 50 కంపెనీల పారా మిలటరీ బలగాలను పంపనున్నట్టు నిర్ణయించారని సమాచారం. హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారుల బృందం త్వరలోనే మణిపూర్‌ లో పర్యటించనుంది. మణిపూర్‌ లో రెండు జాతుల మధ్య నెలకొన్న వైరం కొంతకాలంగా కొనసాగుతోంది. ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. సీఎం సహా మంత్రుల ఇండ్లపైకి ఆందోళనకారులు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత చేయిదాటి పోకుండా ఉండేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

Tags:    
Advertisement

Similar News