లడఖ్‌లో విషాదం.. వరదల్లో కొట్టుకుపోయిన జవాన్లు

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకులతో చైనా సరిహద్దులోని బోధి నది దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద పెరిగింది.

Advertisement
Update:2024-06-29 13:25 IST

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో విషాదం చోటు చేసుకుంది. వాస్తవాదిన రేఖ (LAC) వెంబడి ఉన్న దౌలత్ బేగ్‌ ఓల్డీ ఏరియాలో భారత సైన్యం చేపట్టిన విన్యాసాల్లో ప్రమాదం చోటు చేసుకుంది. నది దాటే విన్యాసాల్లో (రివర్ క్రాసింగ్‌ ఎక్సర్‌సైజ్‌) అపశృతి చోటు చేసుకుంది. విన్యాసాలు జరుగుతున్న స‌మ‌యంలో నదిలో ఒక్కసారిగా వరదలు పెరిగి.. ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.


అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకులతో చైనా సరిహద్దులోని బోధి నది దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద పెరిగింది. దీంతో నీటి ఉధృతికి టీ-72 అనే ట్యాంక్‌ కొట్టుకుపోయింది. అందులో ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

మృతుల్లో నలుగురు జవాన్లు, ఒక JCO ర్యాంకు అధికారి ఉన్నారు. ప్రస్తుతం ఐదుగురి మృతదేహాలు రికవరీ చేసినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం లేహ్‌ నుంచి 148 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Tags:    
Advertisement

Similar News