బీజేపీకి 400 సీట్లు.. ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయంటే..?

న్యూస్‌ 24 - టుడేస్ చాణక్య సైతం ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమికి 130 నుంచి 160 మధ్య స్థానాలు వస్తాయని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి.

Advertisement
Update:2024-06-02 09:02 IST

సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత పోలింగ్ శనివారం ముగిసింది. అనంతరం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్ జూన్‌ 4 విడుదలయ్యే ఎన్నికల‌ ఫలితాలకు సంబంధించి మరింత ఉత్కంఠను పెంచాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్‌ ఖాయమని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందని తేల్చాయి.

అయితే బీజేపీ ఈ ఎన్నికల్లో 400 స్థానాలు సాధిస్తామని ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కాగా, 400 మార్కు బీజేపీ సొంతంగా చేరుకోవడం కష్టమేనని తేల్చాయి ఎగ్జిట్‌ పోల్స్‌. కూటమిగా బీజేపీ 400 స్థానాలు సాధించే అవకాశం ఉందని మూడు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా.. ఎన్డీఏ కూటమి 361 నుంచి 401 స్థానాలు సాధిస్తుందని తేల్చగా.. ఇండియా టీవీ - CNX బీజేపీ కూటమి 371 నుంచి 401 స్థానాలు సాధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక న్యూస్‌ 24 - టుడేస్ చాణక్య సైతం ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమికి 130 నుంచి 160 మధ్య స్థానాలు వస్తాయని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి.

ఇప్పటివరకూ చరిత్రలో 1984లో కాంగ్రెస్‌ సొంతంగా 404 స్థానాలు గెలుచుకుంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు సానుభూతి పవనాలు వీచాయి. దీంతో ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం నమోదు చేసింది. అయితే ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ 30 స్థానాలు గెలుచుకుని కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించింది.

Tags:    
Advertisement

Similar News