బిహార్‌లో పట్టాలు తప్పిన నార్త్ - ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్

వెంటనే స్పందించిన రైల్వే శాఖ.. హుటాహుటిన ప్రమాద స్థలానికి విపత్తు నిర్వహణ దళాలను పంపి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

Advertisement
Update:2023-10-12 07:36 IST

బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ఆనంద్‌ విహార్‌ నుంచి అస్సాంలోని కామాఖ్యకు బ‌య‌ల్దేరిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌ బిహార్‌లోని బక్సర్‌ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వంద మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. రాత్రి 9 గంటల 35 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది.

వెంటనే స్పందించిన రైల్వే శాఖ.. హుటాహుటిన ప్రమాద స్థలానికి విపత్తు నిర్వహణ దళాలను పంపి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. గాయాల పాలైన వారిని పట్నా ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే శాఖ, అస్సాం ప్రభుత్వం టోల్‌ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశాయి.

రెండు ఏసీ-3 టైర్ బోగీలు బోల్తా పడగా.. మరో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. మొత్తం 23 బోగీలున్న ఈ రైలు.. ఢిల్లీ ఆనంద్‌ విహార్ నుంచి రాత్రి 7 గంటల 40 నిమిషాలకు బయల్దేరింది. దాదాపు 33 గంటల పాటు ప్రయాణం చేసి కామాఖ్యకు చేరుకుంటుంది. ప్రమాదం కారణంగా ఢిల్లీ-దిబ్రూగర్ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పాటు 21 రైళ్లను దారి మళ్లించారు. 

Tags:    
Advertisement

Similar News