మళ్ళీ భయపెడుతున్న కరోనా ...మహారాష్ట్రలో 24 గంటల్లో ముగ్గురు మృతి, 562 కొత్త కేసులు

కోవిడ్ పాజిటీవ్ కేసుల పెరుగుదల, మరణాల్లో మహారాష్ట్ర ముందుంది. ఈ రాష్ట్రంలో గత 24 గంటల్లో మూడు మరణాలు రికార్డు కాగా, 562 కొత్త కేసులు నమోదయ్యాయి.

Advertisement
Update:2023-04-03 09:15 IST

దేశాన్ని కోవిడ్ మళ్ళీ భయపెడుతోంది. కొద్ది రోజులుగా రోజువారీ పాజిటీవ్ కేసులు పెరగడమే కాకుండా మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,823 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇది నిన్నటితో పోలిస్తే 27 శాతం పెరిగింది. 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, హర్యానా, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కో మరణం నమోదు కాగా, మహారాష్ట్రలో ముగ్గురుమరణించారు.

కోవిడ్ పాజిటీవ్ కేసుల పెరుగుదల, మరణాల్లో మహారాష్ట్ర ముందుంది. ఈ రాష్ట్రంలో గత 24 గంటల్లో మూడు మరణాలు రికార్డు కాగా, 562 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, ఆదివారం 562 తాజా కోవిడ్ -19 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,488కి చేరుకుంది. ఒక్క‌ ముంబైలోనే 172 కొత్త కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో యాక్టివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో 1,070 యాక్టివ్ కేసులు ముంబైలో, 766 పూణేలో, 616 థానేలో ఉన్నాయి.

మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసుల్లో తీవ్ర పెరుగుదల ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తోందని ఎస్‌ఎల్ రహేజా హాస్పిటల్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్, హెడ్ డాక్టర్ సంజిత్ శశీధరన్ అన్నారు.

"మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల్లో తీవ్ర పెరుగుదల ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది, అయితే, ఈ కేసులు చాలా తేలికపాటివి. ఆసుపత్రిలో చేరాల్సినంత అవసరం లేదు. ఇతర జబ్బులు కూడా ఉన్న వృద్దులు మాత్రమే మరణిస్తున్నారు. అయితే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విమానాశ్రయాలు, దేశంలోకి ప్రవేశించే ఇతర ప్రదేశాలలో నమూనాల శాతాన్ని పెంచాలి.'' అని సంజిత్ శశీధరన్ చెప్పాడు.

Tags:    
Advertisement

Similar News