దేశంలో ప్రస్తుతం 214 కోవిడ్ వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయని ప్రకటించిన కేంద్రం

కోవిడ్ మహమ్మారి ఫోర్త్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనికేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. కోవిడ్ మ్యుటేషన్ ఓమిక్రాన్ కు చెందిన BF.7 సబ్-వేరియంట్, XBB1.16 సబ్-వేరియంట్ లు ఇన్ఫెక్షన్‌ల పెరుగుదలకు కారణమవుతున్నాయని ఆయన తెలిపారు.

Advertisement
Update:2023-04-04 17:00 IST

దేశంలో ప్రస్తుతం 214 కోవిడ్ వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. వీటిల్లో కొన్ని ఉపవేరియంట్ల కారణంగా ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

కోవిడ్ వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయడం అసాధ్యం, కానీ ఇప్పుడు వ్యాపిస్తున్న‌ ఉప-వేరియంట్‌లు విపత్తును కలిగించేంత ప్రమాదకరం కాదని మంత్రి వివరించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఐసియు పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర సంరక్షణ ఏర్పాట్లు సిద్దంగా ఉన్నాయని, వీటిపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని ఆయన అన్నారు.

యువకులు, ఆరోగ్యకరమైన వ్యక్తులలో కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్న గుండెపోటు నివేదికలపై మంత్రి స్పందిస్తూ, గుండెపోటుకు, కోవిడ్‌తో ఏదైనా సంబంధం ఉందా అనే విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని అన్నారు. దీనిపై ప్రభుత్వం పరిశోధనను ప్రారంభించిందని,రెండు-మూడు నెలల్లో ఫలితాలు వస్తాయని ఆయన వెల్లడించారు.

కోవిడ్ మహమ్మారి ఫోర్త్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాండవియా అన్నారు. కోవిడ్ మ్యుటేషన్ ఓమిక్రాన్ కు చెందిన BF.7 సబ్-వేరియంట్, ఇప్పుడు XBB1.16 సబ్-వేరియంట్ లు ఇన్ఫెక్షన్‌ల పెరుగుదలకు కారణమవుతున్నాయని, అయితే ఈ ఉప-వేరియంట్‌లు అంత‌ ప్రమాదకరమైనవి కాదని ఆయన అన్నారు. దేశంలో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ లు కోవిడ్ కు చెందిన అన్ని వేరియంట్ లపై పనిచేస్తాయని మంత్రి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News