24 గంటల్లో 11,109 కరోనా కేసులు, 20 మందిమృతి!

గత 24 గంటల్లో దేశంలో 11,109 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇది అంతకు ముందు 24 గంటల‌ కన్నా 9 శాతం అధికం. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Advertisement
Update:2023-04-14 13:28 IST

కొద్ది రోజులుగా దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దానితో పాటే మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్ధృతికి కారణమైన XBB.1.16 సబ్‌ వేరియంట్ తో పెద్దగా ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు చెప్తున్నప్పటికీ పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి.

గత 24 గంటల్లో దేశంలో 11,109 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇది అంతకు ముందు 24 గంటల‌ కన్నా 9 శాతం అధికం. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో ఢిల్లీలో 1,527, మహారాష్ట్రలో 1,086 మందికి కరోనా సోకింది. 

ఈ కేసులతో కలిపి మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 49,622 కి చేరింది. ఈ 24 గంటల్లో కరోనాతో 20మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరూ కరోనా నిబందనలను పాటించాలని ఆరోగ్య శాఖ కోరింది.

Tags:    
Advertisement

Similar News