1000 కిలోమీటర్లు పూర్తయిన రాహుల్ భారత్ జోడోయాత్ర‌

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం దేశాన్ని విభజిస్తోందని, అందుకే దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం ఈ యాత్రకు 'భారత్ జోడో యాత్ర అని పేరు పెట్టామని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ యాత్ర ఈ రోజుకు వేయి కిలోలీమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నాటకలోని బళ్ళారిలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

Advertisement
Update:2022-10-15 20:05 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారిలో ప్రారంభించి కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్ర ఈ రోజు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కర్నాటకలోని బళ్ళారిలో జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ... "బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది అందుకే దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం ఈ యాత్రకు 'భారత్ జోడో యాత్ర' అని పేరు పెట్టాము.'' అన్నారు.

షెడ్యూల్డ్ కులాలు,తెగలకు వ్యతిరేకంగా కర్ణాటకలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని రాహుల్ గాంధీ శనివారం మండిపడ్డారు. కర్నాటక ప్రభుత్వాన్ని "40 శాతం కమీషన్" ప్రభుత్వం అని పిలుస్తున్నారని ఆరోపించారు.

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకమని, అణగారిన ప్రజలపై 50 శాతం అఘాయిత్యాలు పెరిగిపోయాయని రాహుల్ గాంధీ అన్నారు.

ర్యాలీలో కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మత రాజకీయాలకు పాల్పడుతూ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు.

సెప్టెంబరు 7న ప్రారంభించిన భారత్ జోడో యాత్ర 3,570 కిలోమీటర్లు సాగనుంది. ప్రస్తుతంలో కర్నాటకలో సాగుతోంది. 

Tags:    
Advertisement

Similar News