అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్ డిసీజ్..
అమెరికాలో జాంబీ డీర్ డిసీజ్ శరవేగంగా వ్యాపిస్తోందని, ఇది మానవులకు కూడా సోకే ప్రమాదం ఉందని కెనడా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని ఇంకా మరచిపోకముందే మరో మహమ్మారి దండయాత్రకు సిద్ధమైంది. అమెరికాలో జాంబీ డీర్ డిసీజ్ శరవేగంగా వ్యాపిస్తోందని, ఇది మానవులకు కూడా సోకే ప్రమాదం ఉందని కెనడా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు.
రాబోయే కాలంలో మనుషులు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఈ వ్యాధి అసలు పేరు క్రానిక్ వేస్టింగ్ డిసీజ్. ఇది సోకిన ప్రతి జంతువును చంపే నాడీ సంబంధిత పరిస్థితి. ఈ వ్యాధి ప్రస్తుతం అమెరికాలో జింకలలో వేగంగా వ్యాపిస్తోంది.
జనవరి చివరి వారంలోఇలాంటి రెండు కేసులు వెలుగుచూడడంతో దీని వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జింకలు, దుప్పి, కణుజు, క్యారిబో (ఒక రకమైన జింక) వంటివి వాటికి పరీక్షలు చేయాలని అధికారులు ఆదేశించింది.
ఈ డిసీజ్‌కు ప్రధాన కారణం ప్రొటీన్ల మిస్‌ఫోల్డ్ అంటే అవి సరైన ఆకృతి సంతరించుకోకపోవడం. ఇలా ప్రొటీన్లు సరైన ఆకృతి సంతరించుకోకపోవడాన్ని ప్రియాన్స్‌గా వ్యవహరిస్తారు.ఈ వ్యాధిలో ప్రియాన్స్ కేంద్ర నాడీవ్యవస్థ ద్వారా ప్రయాణించి మెదడు కణజాలం, అవయవాల్లోకి చొరబడి విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో శారీరక, ప్రవర్తనా మార్పులు, క్షీణత, చివరికి మరణానికి కారణమవుతుంది.
ఇది ఒక జంతువు నుండి మరో జంతువుకు సంపర్కం ద్వారా లేదా పరోక్షంగా మలం, నేల, వృక్షసంపద వంటి పర్యావరణంలో వ్యాపిస్తుంది. ఒక జింకలో ఈ లక్షణాలు అభివృద్ధి చెందడానికి ఒక సంవత్సరం కాలం పట్టవచ్చు. జింక బరువును తీవ్రంగా కోల్పోవడం, మొత్తం శక్తిని కోల్పోయి చచ్చుబడిపోయినటుంటి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఒక జింకలో ఈ లక్షణాలు అభివృద్ధి చెందడానికి ఒక సంవత్సరం కాలం పట్టవచ్చు. జింక బరువును తీవ్రంగా కోల్పోవడం, మొత్తం శక్తిని కోల్పోయి చచ్చుబడిపోయినటుంటి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కెనడా ఆరోగ్య నిపుణులు ఇప్పటి వరకూ ఈ వైరస్ మనుషులకు సోకినట్టు ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేవని తెలిపారు. కానీ వేట మాంసం తినడం వల్ల ఇది విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.