రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగియనుందా?

యుద్ధం కారణంగా అమాయక ప్రజలు చనిపోవడం ఆపాలని పుతిన్‌ కోరుకుంటున్నారన్న అమెరికా అధ్యక్షుడు

Advertisement
Update:2025-02-09 13:33 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగియనుందా? ఔననే అంటున్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు తాజాగా స్పందించారు.  యుద్ధం కారణంగా అమాయక ప్రజలు చనిపోవడం ఆపాలని పుతిన్‌ కోరుకుంటున్నారని డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఆయన ఇటీవల రష్యా అధ్యక్షుడితో ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో న్యూయార్క్‌ పోస్టు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వివరాలు వెల్లడించారు. ప్రజలు చనిపోవడం ఆపాలని ఆయన అనుకొంటున్నారు. మరణించిన వారంతా యువత, మంచివాళ్లు. వారు మీ పిల్లల్లాంటి వారే. అకారణంగా లక్షల మంది చనిపోయారు అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను 2022 నాటికి శ్వేత సౌధంలో ఉండి ఉంటే.. ఈ యుద్ధం ఎప్పటికీ జరిగేది కాదన్నారు. అంతేకాదు గతంలో తనకు రష్యా అధినేతతో ఉన్న బలమైన సంబంధాన్ని ఆయన గుర్తుచేశారు. నాకు పుతిన్‌తో సత్సంబంధాలున్నాయి. దేశానికే బైడెన్‌ ఓ అవమానం అని వ్యాఖ్యానించారు.

ఇక ఇరాన్‌ విషయాన్ని ట్రంప్‌ ప్రస్తావిస్తూ.. తాను సైనిక చర్యల కంటే చర్చలకే అధిక ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. ఇరాన్‌తో నాన్‌ న్యూక్లియర్‌ ఒప్పందం చేసుకోవాలని అనుకొంటున్నట్లు వెల్లడించారు. బాంబు దాడుల కంటే దీనిని తాను ఇష్టపడుతానని చెప్పారు.ప్రస్తుతం ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపడానికి చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ తెలిపారు. ఉక్రెయిన్‌తో 500 మిలియన్‌ డాలర్ల డీల్‌ను ట్రంప్‌ చేయాల్సి వస్తుంది. వచ్చేవారం మ్యూనిచ్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌ స్కీ తో భేటీ కానున్నారు.

Tags:    
Advertisement

Similar News