24 మంది మహిళా సిబ్బందిపై హెచ్ఎం అత్యాచారం..! - ఆపై వీడియోల చిత్రీక‌ర‌ణ

ఈ వ్యవహారంతో మరో నలుగురికి సంబంధం ఉందని, వారు పరారీలో ఉన్నార‌ని, వారి కోసం గాలింపు చేపట్టామ‌ని పోలీసు అధికారి మలిర్ హుస్సేన్ సర్దార్ వెల్ల‌డించారు.

Advertisement
Update:2023-09-06 17:38 IST

అత‌నో ప్రైవేట్ స్కూల్ హెడ్‌మాస్ట‌ర్‌. విద్యార్థుల‌కు పాఠాలు చెప్పి.. వారి పురోభివృద్ధికి దోహ‌ద‌ప‌డాల్సిన వృత్తిలో ఉన్న అత‌ను ఆ వృత్తికే క‌ళంకం తెచ్చేలా వ్య‌వ‌హ‌రించాడు. త‌నతో పాటు పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్న స‌హోద్యోగినుల‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అత‌ని ఘాతుకానికి గురైంది ఒక‌రిద్ద‌రు కాదు.. ఏకంగా 24 మంది మహిళా సిబ్బంది. ఈ దారుణానికి పాల్ప‌డ‌ట‌మే కాకుండా వీడియోలు చిత్రీక‌రించి వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.

పాకిస్తాన్‌లో చోటుచేసుకున్న ఈ దారుణానికి సంబంధించి అక్క‌డి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. కరాచీలో గుల్షన్-ఈ-హదీద్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఇర్ఫాన్ గపూర్ మెమూన్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అత‌ను ఉద్యోగం విష‌యంలో, ఇత‌ర విష‌యాల్లో మ‌హిళా సిబ్బందిని భ‌య‌పెట్టి వారిపై త‌న ఆఫీస్‌లోనే అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అంతేకాదు.. ఈ దారుణాల‌ను పాఠ‌శాల సీసీ కెమెరాల‌ను ఉప‌యోగించుకొని రికార్డు చేశాడు.

ప‌ట్టుబ‌డిందిలా...

ఈ కీచ‌క హెడ్‌మాస్ట‌ర్ అకృత్యాలు అత‌ను చిత్రీక‌రించిన ఓ వీడియో ద్వారా బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ వీడియో ఇంట‌ర్‌నెట్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో అత‌ని దురాగ‌తాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ విషయం సింధి విద్యాశాఖ మంత్రి రానా హుస్సేన్ దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. అధికారుల దర్యాప్తులో.. ఆ పాఠశాలకు అనుమతులే లేవని తేలింది. ఆ ప్రాంత పోలీసు అధికారి మలిర్ హుస్సేన్ సర్దార్ ఈ ఘ‌ట‌న‌పై మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో బాధితులు మొత్తం పాఠశాలకు చెందిన మహిళలుగానే గుర్తించామన్నారు. వీడియోలను నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు. ఈ వ్యవహారంతో మరో నలుగురికి సంబంధం ఉందని, వారు పరారీలో ఉన్నార‌ని, వారి కోసం గాలింపు చేపట్టామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.


Tags:    
Advertisement

Similar News