నేపాల్ ప్లేన్ క్రాష్: 5గురు భారతీయులతో సహా 72 మంది దుర్మరణం!
యతి ఎయిర్‌లైన్స్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన ఐదుగురు భారతీయులు అభిషేక్ కుష్వాహ, బిషాల్ శర్మ, అనిల్ కుమార్ రాజ్‌భర్, సోనూ జైస్వాల్, సంజయ జైస్వాల్‌లుగా గుర్తించారు.
నేపాల్‌లోని పోఖారాలో ఆదివారం ఉదయం 11 గంటలకు యతి ఎయిర్‌లైన్స్ ATR 72 విమానం కూలిపోవడంతో అందులోని ప్రయాణీకులందరూ దుర్మరణం పాలయ్యారని అధికారులు ప్రకటించారు.అందులో ఐదుగురు భారతీయులతో సహా 68 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.
యతి ఎయిర్‌లైన్స్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన ఐదుగురు భారతీయులు అభిషేక్ కుష్వాహ, బిషాల్ శర్మ, అనిల్ కుమార్ రాజ్‌భర్, సోనూ జైస్వాల్, సంజయ జైస్వాల్‌లుగా గుర్తించారు.
68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో విమానం ఖాట్మండు నుండి పోఖారాకు బయలుదేరిన 20 నిమిషాల తర్వాత గమ్యస్థానానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని నివేదికలు తెలిపాయి.
మరో వైపు యతి ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి నేపాల్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాదం తర్వాత ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ఎలియాస్ ప్రచండ మంత్రి మండలి అత్యవసర సమావేశం నిర్వహించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. విమాన ప్రమాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం ఒకరోజు జాతీయ సంతాప దినం కూడా ప్రకటించింది.
నేపాల్ ఆర్మీ ప్రతినిధి మాట్లాడుతూ, ఇప్పటి వరకు 45 మృత దేహాలను వెలికి తీశామని, మరిన్ని మృతదేహాలను వెలికితీయాల్సి ఉందని, విమానం ముక్కలుగా విరిగిపోయిందని చెప్పారు.