అమెరికా అంతటా విమానాలకు బ్రేక్.. ఎందుకంటే..?

నోటీస్ టు ఎయిర్ మిషన్స్ (నోటామ్) అనే వ్యవస్థ విఫలం కావడంతో, పైలట్లకు ఎయిర్ పోర్ట్ అథారిటీలకు ఎలాంటి కమాండ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

Advertisement
Update:2023-01-11 18:52 IST

సాంకేతిక లోపాలతో విమానాలు అప్పుడప్పుడూ ఆలస్యం అవుతుంటాయి, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పొగమంచుకి విమానాలు ఆలస్యం కావడం పరిపాటి. కానీ అమెరికాలో ఒకేరోజు విమానాలన్నీ ఆగిపోయాయి. అసలేంటి కారణం అని ఆరా తీస్తే అది ఓ సాఫ్ట్ వేర్ తప్పిదం అని తేలింది. అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కంప్యూటర్ సిస్టమ్‌ లో భారీ సాంకేతిక లోపం తలెత్తడంతో అమెరికాలో విమానాలకు బ్రేక్ పడింది. సాంకేతిక లోపం కారణంగా యునైటెడ్ స్టేట్స్ మొత్తం విమానాలు ఆగిపోయాయి.

ఈరోజు ఉదయాన్నుంచే విమానాలపై ప్రభావం పడింది. ఉదయం ఐదున్నర గంటల సమయానికి యునైటెడ్ స్టేట్స్ లో 400 విమానాలు ఆలస్యమైనట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌ సైట్ ‘ఫ్లైట్ అవేర్ యూఎస్’ తెలిపింది. ఎక్కడి విమానాలు అక్కడే ఉండడంతో అమెరికాలో గందరగోళం నెలకొంది. ఎయిర్ పోర్టుల్లో వేలాదిమంది వేచి చూస్తున్నారు. అసలేం జరిగింతో తెలియక, గంటలతరబడి వారు అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత సాంకేతిక కారణాలను వెల్లడించిన అధికారులు దాన్ని త్వరగా సరిదిద్దుతామని చెప్పారు.

నోటీస్ టు ఎయిర్ మిషన్స్ విఫలం..

నోటీస్ టు ఎయిర్ మిషన్స్ (నోటామ్) అనే వ్యవస్థ విఫలం కావడంతో, పైలట్లకు ఎయిర్ పోర్ట్ అథారిటీలకు ఎలాంటి కమాండ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు, ఇతర వాతావరణ పరిస్థితుల గురించి పైలట్లు, ఇతర విమాన సిబ్బందిని హెచ్చరించే ఈ వ్యవస్థ చప్పుడుచేయకపోవడంతో విమానాలు ఎగిరే సాహసం చేయలేదు.అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్‌ లో స‌మ‌స్యను ఎదుర్కొంటున్నందున యునైటెడ్ స్టేట్స్ అంతటా అన్ని విమానాలు నిలిపివేశామని వెబ్‌ సైట్ లో పేర్కొన్నారు. నోటీస్‌ టు ఎయిర్‌ మిషన్స్ సిస్టమ్‌ పునరుద్ధరించే చర్యలు చేపట్టారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News