Google Pixel 9 | భారత్ మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ 9 ప్రో సిరీస్ ఫోన్ల ఆవిష్కరణకు ముహూర్తం రెడీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
గూగుల్ (Google) ఆగస్టు 13న అమెరికాతోపాటు గ్లోబల్ మార్కెట్లలో మేడ్ బై గూగుల్ (Made by Google) ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించనున్నది.
Google Pixel 9 | సెర్చింజన్ గూగుల్ తన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో మేడ్ బై గూగుల్ (Made by Google) హార్డ్‌వేర్ లాంచింగ్ తర్వాత రోజు గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ (Google Pixel 9 series) ఫోన్లను గూగుల్ ఆవిష్కరించనున్నది. నాలుగు మోడల్స్ - గూగుల్ పిక్సెల్ 9 ప్రో (Google Pixel 9 Pro), గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ (Google Pixel 9 Pro Fold) మోడల్స్‌లో లబిస్తుందని భావిస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 8 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో పిక్సెల్ మోడ్స్ ఫోన్లకు కొనసాగింపుగా గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు వస్తున్నాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ (Google Pixel 9) ఫోన్లను ఆవిష్కరిస్తామని గూగుల్ తెలిపింది. భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్న తొలి గూగుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ (Google Pixel 9 Pro Fold) ఫోన్ కానున్నది. గూగుల్ తన ఉత్పత్తుల విక్రయానికి ఫ్లిప్ కార్ట్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ (Google Pixel 9 series) ఫోన్ల ఆవిష్కరణ కోసం ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ డెడికేట్ చేసింది. ఆగస్టు 14న గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరిస్తామని ధృవీకరించింది. ఫ్లిప్‌కార్ట్ తన మైక్రోసైట్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు అని మాత్రమే పేర్కొంటున్నా, ఇందులో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ 9 ప్రో మోడల్ ఫోన్లు ఉంటాయని పోస్టర్ చెబుతోంది.
గూగుల్ (Google) ఆగస్టు 13న అమెరికాతోపాటు గ్లోబల్ మార్కెట్లలో మేడ్ బై గూగుల్ (Made by Google) ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించనున్నది. ఆగస్టు 14న గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ సందర్భంగా వాటి ధరలు వెల్లడించనున్నది. గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ మోడల్ ఫోన్లు కూడా ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే గూగుల్ ఇండియా వెబ్‌సైట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్లు లిస్ట్ చేశారు. భారత్‌తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో మాత్రమే గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 6 (Samsung's Galaxy Z Fold 6), వన్ ప్లస్ ఓపెన్ (OnePlus Open), టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ (Tecno Phantom V Fold) ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో (Google Pixel 9 Pro) ఫోన్ 6.3-అంగుళాల డిస్ ప్లే విత్ 16 జీబీ ర్యామ్ తో వస్తుందని భావిస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ (Google Pixel 9 Pro Fold) ఫోన్ 6.3-అంగుళాల కవర్ స్క్రీన్, 8-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 16 జీబీ ర్యామ్, న్యూ టెన్సార్ జీ4 ప్రాసెసర్‌తో వస్తుందని తెలుస్తోంది.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో (Google Pixel 9 Pro) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. 50- మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, రెండు 48-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు, సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 42- మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయని తెలుస్తోంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ (Google Pixel 9 Pro Fold) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వస్తుందని సమాచారం. 48-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, 10.5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, 10.8- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 10-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉన్నాయి.