ఐఫోన్‌లో తెలుగు కీబోర్డు ఫ్రీ.. ఇక మన భాషలో ధనాధనా టైపింగ్
థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా నేరుగా తెలుగు, తమిళ్, కన్నడ వంటి దాదాపు అన్ని ప్రాంతీయ భాషల కీబోర్డులు ఉచితంగా అందుబాటులోకి రాబోతున్నాయి.
ఐఫోన్ 15 లాంచింగ్‌తో ట్రెండింగ్‌లో ఉన్న యాపిల్ తన లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఐవోస్ 17ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని ప్రాంతీయ భాషల వినియోగదారులకు వీలుగా యాపిల్ తన ఐఫోన్లలో అద్భుతమైన వెసులుబాట్లను ఈ ఐవోఎస్ 17తో తీసుకొస్తోంది. ఇందులో ముఖ్యమైనది ప్రాంతీయ భాషల్లో కీబోర్డులు అందుబాటులోకి రావడం.
తెలుగు టైపింగ్ అలవోకగా
ఆండ్రాయిడ్‌లో తెలుగు కీబోర్డ్‌లు ఉచితంగానే దొరుకుతాయి గానీ, ఐవోఎస్‌లో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. ఐవోఎస్ అప్‌డేట్‌తో థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా నేరుగా తెలుగు, తమిళ్, కన్నడ వంటి దాదాపు అన్ని ప్రాంతీయ భాషల కీబోర్డులు ఉచితంగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది తెలుగులో మెసేజ్‌లు పంపాలనుకునే తెలుగు వారికి మంచి ఆప్షన్ అని బీటా యూజర్లు చెబుతున్నారు.
ఇలా యాడ్ చేసుకుని.. అలా వాడేసుకోండి
తెలుగు కీబోర్డు కావాలనుకుంటే సెట్టింగ్స్‌లో జనరల్‌లోకి వెళ్లి కీబోర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. యాడ్ న్యూ కీబోర్డ్ నొక్కి తెలుగును యాడ్ చేయాలి. ఇప్పుడు మీరు వాట్సాప్, టెక్స్ట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎక్కడ మెసేజ్ చేయాలనుకున్నా కీబోర్డులో లెఫ్ట్ కార్నర్‌లో ఉండే గ్లోబ్ సింబల్‌ను క్లిక్ చేసి అందులో నుంచి తెలుగును సెలెక్ట్ చేయాలి. ఇక మీరు ఇంగ్లిషులో టైప్ చేసినా అది తెలుగులోకి మారిపోతుంది. అంతేకాదు ప్రెడిక్షన్ కూడా చూపిస్తుంది. దానిలో నుంచి సెలెక్ట్ చేసుకుని ధనాధనా తెలుగులో టైప్ చేసేయవచ్చు.