కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడం
బీఆర్‌ఎస్ నాయకుడు మేడె రాజీవ్ సాగర్
కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని బీఆర్‌ఎస్ నాయకుడు, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తేల్చిచెప్పారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్ పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై పది నెలల్లోనే ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే దెబ్బకు దెబ్బ తీయడం బీఆర్ఎస్ కు పెద్ద విషయం కాదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని ప్రగాల్భాలు పలికిన కాంగ్రెస్.. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క విపక్ష నాయకుడిపైనా దాడి జరగలేదన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిరిగానే బీఆర్‌ఎస్ ఆలోచించి ఉంటే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేదన్నారు. తెలంగాణ ప్రజలు రౌడీ రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీని మూసీలో కలపడం ఖాయమని హెచ్చరించారు.