ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుందా?

క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకంటే థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో పెద్ద గ్యాంగ్‌తోనే దొరికాడు. ఒక స్టార్ హోటల్లో తన మనుషులతో జూదమాడిస్తుంటే పోలీసులు దాడి చేసి అరెస్ట్‌ చేశారు.

Advertisement
Update:2023-05-02 10:26 IST

అతి చేస్తే గతి చెడుతుందనే సామెత తెలుగులో చాలా పాపులర్. ఆ సామెత ఇప్పుడు చికోటి ప్రవీణ్‌కు సరిగ్గా సరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెషనల్ గ్యాంబ్లర్ ఎవరు అంటే వెంటనే చికోటి ప్రవీణ్ అని చెప్పేస్తారు. ఇప్పటికే చికోటిపై అనేక ఆరోపణలున్నాయి. బాగా డబ్బు ఉన్న‌వాళ్ళతో అత్యంత సన్నిహితంగా ఉండే ప్రవీణ్‌కు రాజకీయ నేతలు, వ్యాపారస్తులు, సెలబ్రిటీలు కూడా ఖాతాదారులే. బాగా డబ్బులు ఖర్చులు చేయగలిగినవాళ్ళను ప్రత్యేకంగా చికోటి విదేశాలకు తీసుకెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడిస్తారనే ఆరోపణలున్నాయి.

అలాంటి చికోటి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకంటే థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో పెద్ద గ్యాంగ్‌తోనే దొరికాడు. ఒక స్టార్ హోటల్లో తన మనుషులతో జూదమాడిస్తుంటే పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. రు.20 కోట్ల విలువైన చిప్స్ దొరికాయంటేనే అర్థ‌మవుతోంది గ్యాంబ్లింగ్ ఎన్ని వందల కోట్లలో జరుగుతోందో. విచిత్రం ఏమిటంటే అంతర్జాతీయ స్థాయిలో గ్యాంబ్లింగ్ సెంటర్లలో పట్టాయా కూడా ఉంది. అలాంటి పట్టాయాకు గ్యాంబ్లింగ్‌కు కావాల్సిన సరంజామా మొత్తాన్ని ఇండియా నుండే చికోటి తరలించాడట.

ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పుడు పట్టుబడిన 93 మందిలో తెలుగువాళ్ళే 83 మందున్నారట. ఇప్పటికే చికోటి మీద హవాలా, మనీ లాండరింగ్ ఆరోపణలున్నాయి. ఈ విషయమై చికోటీని ఈడీ విచారిస్తోంది. విచారణ పూర్తయ్యేంతవరకు అయినా అన్నీ వ్యవహారాలను కట్టిబెట్టాలని అనుకుంటారు ఎవరైనా. కానీ అలా అనుకుంటే ఇతను చికోటి ఎందుకవుతాడు. అందుకనే ఒకవైపు దర్యాప్తులు జరుగుతున్నా మరోవైపు విదేశాల్లో గ్యాంబ్లింగ్ గ్రూపులను తీసుకెళుతునే ఉన్నాడు.

ఇప్పటికే శ్రీలంక, నేపాల్, మారిషస్‌లో చికోటి పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు పట్టాయాలో అరెస్టయిన చికోటి భవిష్యత్తు ఏమిటో థాయ్ పోలీసులు, కోర్టులే చెప్పాలి. మామూలుగా అయితే మనదేశంలో తప్పించుకున్నంత సులభం కాదు విదేశాల్లోని పోలీసులు, కేసులు, కోర్టుల నుండి తప్పించుకోవటం. మరి చికోటి ఖర్మ ఎలాగుందో చూడాల్సిందే. ఏదేమైనా ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందనేందుకు చికోటి ప్రవీణ్ కథే తాజా ఉదాహరణ.

Tags:    
Advertisement

Similar News