ఈ ఉంగరం చాలా స్మార్ట్ గురూ..

చూడటానికి చిన్న రింగే అయినా ఇది స్మార్ట్‌వాచ్ అందించిన ఫీచర్లనే అందిస్తుంది. SpO2 మానిటరింగ్ ఫీచర్ ద్వారా రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను, శ్వాసకోశ ఆరోగ్యాన్ని చెక్ చేస్తుంది.

Advertisement
Update:2023-07-26 14:05 IST

బడ్జెట్‌లోనే కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ జనాలను ఆకట్టుకొనే ప్రొడక్ట్స్ ను రిలీజ్ చేయ‌డంలో ముందు ఉంటుంది బోట్ కంపెనీ. ఇప్పటికే అందుబాటు ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు,హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ ఇయర్‌బడ్స్, లాంటి ప్రొడక్ట్స్ లాంచ్ చేసి చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ కంపెనీ మరొక స్మార్ట్ ప్రొడక్ట్‌ను పరిచయం చేసింది.. అదే స్మార్ట్ రింగ్..

బోట్ స్మార్ట్ రింగ్ పేరుతో ఇండియాలో లాంచ్ చేసిన ఉంగరం అందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది చేతికి పెట్టుకోగానే మన హెల్త్‌ ట్రాకర్‌గా మారిపోతుంది. boAt Smart Ring ధరించిన వారి స్టెప్ కౌంట్, స్లీప్ క్వాలిటీ, టెంపరేచర్ వంటి హెల్త్, ఫిట్‌నెస్ వివరాలను ట్రాక్ చేస్తుంది.

రింగ్ అంటే మనకి వెండి, బంగారం ఇంకా రిచ్ గా ఉండాలి అంటే ప్లాటినం తెలుసు.. అయితే ఈ రింగ్ రిచ్ గా కనిపించడం కోసం సెరామిక్, మెటల్ వంటి హై-క్వాలిటీ పదార్థాలతో తయారు చేశారు. అందుకే ఇది యూజర్లకు ప్రీమియం లుక్, ఫీల్‌ను అందిస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉండటం వల్ల నీటిలో, ఎండలో ఎక్కడకు వెళ్లినా దీన్ని పెట్టుకొనే ఉండొచ్చు.

చూడటానికి చిన్న రింగే అయినా ఇది స్మార్ట్‌వాచ్ అందించిన ఫీచర్లనే అందిస్తుంది. SpO2 మానిటరింగ్ ఫీచర్ ద్వారా రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను, శ్వాసకోశ ఆరోగ్యాన్ని చెక్ చేస్తుంది. స్లీప్ ని మానిటర్ చేస్తుంది. ఈ మొత్తం డేటా బోట్ రింగ్ యాప్‌లో స్టోర్‌ అవుతుంది. దీంతో యూజర్లు తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుంది.

స్మార్ట్ రింగ్ మహిళల కోసం మెన్‌స్ట్రువల్ ట్రాకర్ ని కూడా అందిస్తోంది. ఇది పీరియడ్ ట్రాకింగ్, ప్రిడిక్షన్ తో బాటు అవసరం అయితే నోటిఫికేషన్లు, రిమైండర్ల ద్వారా కూడా గుర్తు చేయగలదు.

శాంసంగ్​ ఇటీవల గెలాక్సీ రింగ్​ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బోట్ కంపెనీ కూడా తన బ్రాండ్​తో స్మార్ట్​ రింగ్​ను తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే ఈ స్మార్ట్ రింగ్ మార్కెట్ లాంచ్ తేదీ గురించి సమాచారం లేదు. ఆగస్ట్‌లో ఈ రింగ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. మార్కెట్ లోకి రిలీజ్ అయిన తరువాత ఈ బోట్ స్మార్ట్ రింగ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో సహా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉండనుంది.

Tags:    
Advertisement

Similar News