ఫ్రీ కరెంట్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ కు రూ.508.95 కోట్లు
విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుకు మంజూరు చేసిన టీజీఎస్పీడీసీఎల్
వ్యవసాయానికి ఉచిత కరెంట్ సరఫరా చేసే విద్యుత్ లైన్ల ఆధునీకరణ, లో ఓల్టేజీ సమస్య పరిష్కారానికి కొత్త ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని జిల్లాల్లో ఈ పనులను రూ.508.95 కోట్లతో చేపట్టనుంది. రైతులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేసేందుకు ఈ పనులు చేపట్టనున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, సరూర్ నగర్, మెదక్, వికారాబాద్, యాదాద్రి, నారాయణ్ పేట్, రాజేంద్రనగర్, గద్వాల్, రంగారెడ్డి, సంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ ఆపరేషన్ సర్కిళ్లలో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ నిధులతో 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు 13,318, హెట్‌టీ లైన్లు 3,497.8 కి.మీ.లు, ఎల్‌టీ లైన్లు 5,098.3 కి.మీ.ల పరిధిలో పనులు చేపట్టనున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల కోసం కింది లింక్ క్లిక్ చేయండి
https://www.teluguglobal.com/pdf_upload/free-power-infrasructure-1363410.pdf