నీ కొడుకు ఎన్ని పరుగులు చేశాడు.? అమిత్ షాకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్

అమిత్ షా మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డీఎంకే మిత్రపక్షాలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.

Advertisement
Update:2023-07-30 17:33 IST

తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై విరుచుకపడ్డారు. డీఎంకేని కుటుంబ పార్టీగా అభివర్ణిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఆదివారం కౌంటర్ ఇచ్చారు. నీ కొడుకు జై షాకు ఏ అర్హత ఉందని బీసీసీఐ సెక్రటరీగా ఎన్నికయ్యాడని ప్రశ్నించారు. బీజేపీ తమిళనాడు చీఫ్ కే. అన్నామలై పాదయాత్రకు రామేశ్వరంలో అమిత్ షా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డీఎంకే మిత్రపక్షాలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. డీఎంకే ఒక కుటుంబ పార్టీగా అమిత్ షా అభివర్ణించారు. దీనిపై తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. డీఎంకే యూత్ వింగ్ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. తాను ఊరికే మంత్రిని అయిపోలేదని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడి, ఎన్నికల్లో గెలిచిన తర్వాతే తనకు మంత్రి పదవి వరించిందని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు.

డీఎంకే నాయకులు నన్ను చీఫ్ మినిస్టర్ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు అమిత్ షా చెబుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను.. జైషా ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు.. క్రికెట్‌లో ఎన్ని పరుగులు చేశాడు.. ఏం అర్హత ఉందని బీసీసీఐకి సెక్రటరీ అయ్యాడని ప్రశ్నించారు. డీఎంకేలో ఏం జరుగుతుందో అమిత్‌షాకు ఏం అవసరమని ఉదయనిధి మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News