న్యూఇయర్ రెజల్యూషన్స్ ఎలా ఉండాలంటే..

New Year Resolutions: కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేముందు ప్రతి ఒక్కరూ కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. ‘ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాలి’, ‘జిమ్‌లో చేరాలి’, ‘ఫలానా పని చేసి తీరాలి’ అని నిర్ణయించుకుంటారు.

Advertisement
Update:2022-12-31 19:12 IST

కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేముందు ప్రతి ఒక్కరూ కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. 'ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాలి', 'జిమ్‌లో చేరాలి', 'ఫలానా పని చేసి తీరాలి' అని నిర్ణయించుకుంటారు. కానీ కొంతకాలానికే వాటికి గాలికొదిలేస్తుంటారు. అయితే సాధ్యం అయ్యే రెజల్యూషన్స్ పెట్టుకుని కాస్త మోటివేటెడ్‌గా ఉండడం వల్ల అనుకున్నవి సాధించొచ్చు అంటున్నారు నిపుణులు. కొత్త ఏడాది కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే..

జీవితాన్ని మెరుగు పర్చుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే దానికోసం ఒక నిర్ణయం తీసుకోవడంలోనే అందరూ ఫెయిల్ అవుతుంటారు. నిజానికి నిర్ణయాలు ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ, కొత్త ఏడాది సందర్భంగా ఒక తీర్మానం పెట్టుకుంటే ఏడాది మొత్తం దానికి కట్టుబడి ఉండే వీలుంటుందని చాలామంది అభిప్రాయం. ఈ పద్ధతి మంచిదే. అయితే సాధ్యం కాని రెజల్యూషన్స్ కాకుండా ఓవరాల్ ఇంప్రూవ్‌మెంట్ కోసం నిర్ణయాలు తీసుకోవాలి. అవెలా ఉండాలంటే..

రెజల్యూషన్స్ తీసుకునేముందు చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. క్వాలిటీ లైఫ్, సోషల్ లైఫ్, పర్సనల్ లైఫ్.. ఇలా డివైడ్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. జిమ్‌లో చేరాలి, స్మోకింగ్‌ మానేయాలి లాంటి తీర్మానాలు మర్చిపోవడం, జోక్‌గా తీసుకోవడం చాలామందికి మామూలే. అందుకే వాటి విషయం అటుంచి ప్రాక్టికల్‌గా, ఈజీగా ఫాలో అవ్వగలిగే నిర్ణయాలు తీసుకోవాలి. 'డిజిటల్ టైం తగ్గిస్తాను', 'సహనంగా ఉండడాన్ని అలవాటు చేసుకుంటాను', 'కోపాన్ని తగ్గించుకుంటాను', 'కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తాను', 'అందరితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నిస్తాను' లాంటి రెజల్యూషన్స్ పెట్టుకోవడం వల్ల అవి ఏడాది మొత్తంలో ఎన్నో సార్లు గుర్తొచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఫెయిల్ అయినా మళ్లీ సక్సెస్ అవ్వొచ్చు. ఒకేసారి కాకపోయినా మెల్లగా అయినా వ్యక్తిత్వాన్ని మార్చుకునే వీలుంటుంది.

ఇక వీటితో పాటు శారీరకంగా యాక్టివ్‌గా లేకపోతే యాక్టివ్‌గా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది ఓవరాల్ హెల్త్‌కు ఎంతో ముఖ్యం. ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి వేధిస్తుంటే వాటిని తగ్గించుకునే మార్గాలు వెతకాలి. వచ్చే ఏడాదిని ఒత్తిడి లేని సంవత్సరంగా మార్చుకోవాలి. మానసిక ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యమైనది. ఇక కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వచ్చే ఏడాదికి గానూ ఒక గోల్ పెట్టుకోవాలి. ఏదైనా కోర్సు నేర్చుకోవడం లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం లాంటి తీర్మానాలు పెట్టుకోవాలి. అలాగే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి, కుటుంబపరమైన సవాళ్ల గురించి, ప్రయాణాల గురించి, పిల్లల గురించి, పెళ్లి గురించి, సోషల్ యాక్టివిటిస్ గురించి ఇలా.. రకరకాల అవసరమైన తీర్మానాలు చేసుకోవాలి. అయితే అవి ఏడాది పొడవునా ఎప్పుడైనా అమలు చేసే వీలుండేలా చూసుకోవాలి. సాధ్యం కాని తీర్మానాలు చేసుకోకపోవడమే మేలు.

Tags:    
Advertisement

Similar News