ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!
రిలేషన్‌షిప్ అనేది ఎప్పుడూ సంతోషంగా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, మారుతున్న పరిస్థితుల వల్ల ఇది చాలా కష్టమైపోతోంది
రిలేషన్‌షిప్ అనేది ఎప్పుడూ సంతోషంగా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, మారుతున్న పరిస్థితుల వల్ల ఇది చాలా కష్టమైపోతోంది. అందుకే హ్యాపీ రిలేషన్ కోరుకునేవాళ్లు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
ఎవరి రిలేషన్‌షిప్ అయినా మొదట్లో బలంగా, హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత సమస్యలు ఒక్కోటిగా మొదలవుతుంటాయి. సంతోషం కొరవడుతుంది. ఇలా జరగకుండాఉండాలంటే ఇలా చేయాలి.
రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ముందుగా ఎక్స్‌పెక్టేషన్స్ మానుకోవాలి. మొదటి రోజుల్లో ఎలాగైతే ఒకరినొకరు గౌరవించుకున్నారో అదే చివరి వరకూ కంటిన్యూ చేయాలి. ఒకరికి నచ్చినట్టు మరొకరు ఉండాలని కోరుకుంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు.
రిలేషన్‌షిప్‌లో ఇగోలు పనికిరావు. ఎప్పుడైనా చిన్న సమస్యొస్తే.. వెంటనే సారీ చెప్పేందుకు రెడీగా ఉండాలి. అవతలి వాళ్లే ముందు చెప్పాలని మొండిపట్టు పట్టకూడదు. దీనివల్ల సమస్య మరింత ముదురుతుందే గానీ తగ్గదు. కాబట్టి సారీ చెప్పడం అనేది రిలేషన్‌షిప్‌లో కీలకమైన విషయంగా గుర్తుంచుకోవాలి.
రిలేషన్‌షిప్ వీక్‌గా మారడానికి కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ఒక కారణం. పెళ్లయిన తర్వాత చాలామంది కపుల్స్ కెరీర్, సంపాదన వంటి మిగతా విషయాల మీద ఫోకస్ పెడతారు. దీనివల్ల తెలియంకుండానే ఇద్దరిమధ్య కొంత గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజూ కలిసి మాట్లాడుకునేందుకు కొంత సమయం కేటాయించుకోవాలి. కలిసి బయటకెళ్లడం, ఆటలు ఆడడం లాంటివి చేయొచ్చు.
అప్పుడప్పుడు దూరం కూడా రిలేషన్‌షిప్ బలపరుస్తుంది. అందుకే ఎప్పుడూ కలిసే ఉండకుండా అప్పుడప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ పార్ట్‌నర్‌ను మీరు ఎంత మిస్ అవుతున్నారో మీకు తెలుస్తుంది.