పెళ్లి తర్వాత పాటించాల్సిన రూల్స్!

ప్రేమలో ఉన్నప్పుడు ‘ఇలా ఉండాలి’, ‘అలా ఉండాలి’ అని ఎవరూ చెప్పరు. ఎందుకంటే ప్రేమలో రూల్స్ ఉండవు. కానీ, పెళ్లి తర్వాత మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయి.

Advertisement
Update:2023-11-26 11:15 IST

సింగిల్‌గా ఉన్నంత వరకూ ఎవరి ప్రపంచంలో వాళ్లు హాయిగా విహరిస్తుంటారు. అంతవరకూ ఓకే. మరి పెళ్లయినప్పుడు? పెళ్లి తర్వాత ఇండివిడ్యువల్ లైఫ్ కాస్తా మ్యారిటల్ లైఫ్‌లా మారిపోతుంది. ఆ లైఫ్‌ని కూడా హ్యాపీగా మార్చుకోవాలంటే.. కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ అవసరం. ఆ బ్యాలెన్స్ కాస్త అటు ఇటు అయినా ఆ ఎఫెక్ట్ లైఫ్‌లాంగ్ ఉండిపోతుంది.

ప్రేమలో ఉన్నప్పుడు ‘ఇలా ఉండాలి’, ‘అలా ఉండాలి’ అని ఎవరూ చెప్పరు. ఎందుకంటే ప్రేమలో రూల్స్ ఉండవు. కానీ, పెళ్లి తర్వాత మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే పెళ్లి అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు. అదొక కమిట్‌మెంట్, బాధ్యత. కాబట్టి కొన్ని మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

త్యాగాలు వద్దు

పరిచయం అయిన కొత్తలో ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అలాంటప్పుడే కొన్ని విషయాల్లో త్యాగం చేయడానికి సిద్ధపడతారు. ఆ త్యాగం ఎదుటివారికి అర్థమవ్వాలని కూడా ప్రయత్నిస్తుంటారు. ఆ త్యాగానికి ‘ప్రేమ’ అనే ట్యాగ్‌ తగిలించి తమలో తామే మురిసిపోతుంటారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ త్యాగాలే ఇబ్బందులుగా మారతాయి. కాబట్టి మరీ ఎక్కువ త్యాగాలు పనికి రావు. ముందునుంచే ఉన్న మీ అభిరుచుల్ని మీ పార్ట్‌నర్‌‌తో పంచుకోవాలి. ఒకరి అభిరుచుల్ని ఒకరు గౌరవించుకోవాలి. అప్పుడు సమస్యలుండవు.

స్ట్రెంత్స్ తెలుసుకుంటే..

మీ పార్ట్‌నర్ ఎలాంటి విషయాల్లో బెస్ట్? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాను క్రియేటివ్ పర్సనా ? కష్టపడే వ్యక్తా? ఏదైనా కొత్త విషయం నేర్చుకోడానికి ఆసక్తి చూపుతారా? లాంటి విషయాలు కాస్త గమనిస్తే హ్యాపీగా ఉండడానికి ‘కీ’ దొరికినట్టే. వాళ్లకున్న క్వాలిటీస్‌ని బట్టి దానికి తగ్గట్టుగా నడుచుకుంటే చాలు. తాను క్రియేటివ్ పర్సన్ అని మీకనిపిస్తే తన సృజనాత్మకతను మెచ్చుకోవడం, ప్రోత్సహించడం లాంటివి చేస్తే రిలేషన్‌షిప్ ఎప్పటికీ నిలిచిపోతుంది.

చిన్న మాటలే అయినా..

మీ పార్ట్‌నర్ మీకోసం ఏదైనా చేసినా, తమ ద్వారా మీకేదైన మంచి జరిగినా ఓ చిన్న థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, మీ వల్ల మీ పార్టనర్ హర్ట్ అయినా ‘సారీ’ చెప్పండి. ‘థాంక్స్’, ‘సారీ’ వినడానికి చాలా చిన్న పదాలే అయినా.. రిలేషన్‌షిప్‌లో వీటిదే ‘కీ’ రోల్. అలాగే ఒకరికి ఒకరు ఇచ్చుకునే గిఫ్ట్‌లు, గ్రీటింగ్‌లు, సర్‌ప్రైజ్‌లు కూడా రిలేషన్‌షిప్‌ను బలపరుస్తాయి. కాబట్టి వీటిని మర్చిపోవద్దు.

మూడో వ్యక్తి జోక్యం

ఇద్దరి మధ్యా ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు మీకు మీరే దాన్ని పరిష్కరించుకోవాలి. గొడవ మూడో వ్యక్తి దాకా వెళ్లకూడదు. జరిగిన తప్పును శాంతంగా పరిష్కరించుకోవాలి. ప్రేమలో ఎదుటివారి తప్పును వేలెత్తి చూపించడం కన్నా ఆ పొరపాటు ఎందుకు జరిగిందో తెలుసుకునే సహనం ఉండాలి.

ఇవి కూడా..

కపుల్స్ మధ్య కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. రోజూ కలిసే బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం. ప్రతిరోజూ నిద్రకు ముందు కాసేపు మాట్లాడుకోవడం. వారానికొకరోజు సెకండ్‌ షో సినిమాకెళ్లడం లాంటివి. ఇలా కలిసి గడిపే సందర్భాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. ఇలాంటి అలవాట్లే ఇద్దరినీ మానసికంగా దగ్గరగా ఉంచుతాయి. ఇద్దరి మధ్యా ఎప్పుడైనా గ్యాప్ వచ్చినప్పుడు ఈ అలవాట్లే తిరిగి దగ్గర చేస్తాయి.

Tags:    
Advertisement

Similar News