త‌ల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో.. వారికీ వాటా ఉంటుంది - సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

ఓ పిటిష‌న్‌ విష‌యంలో సుప్రీంకోర్టు శుక్ర‌వారం కీల‌క తీర్పు వెలువ‌రించింది. వివాహేతర సంబంధాలతో పుట్టిన సంతానానికి హిందూ చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందా అనే అంశంపై ఈ పిటిష‌న్ దాఖ‌లైంది.

Advertisement
Update:2023-09-02 15:00 IST

త‌ల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో.. వారికీ వాటా ఉంటుంది - సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

ఓ పిటిష‌న్‌ విష‌యంలో సుప్రీంకోర్టు శుక్ర‌వారం కీల‌క తీర్పు వెలువ‌రించింది. వివాహేతర సంబంధాలతో పుట్టిన సంతానానికి హిందూ చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందా అనే అంశంపై ఈ పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన అత్యున్న‌త న్యాయ‌స్థానం చెల్లుబాటు కాని లేదా రద్దు చేయదగ్గ వివాహాల ద్వారా పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులేనని స్పష్టం చేసింది. ఈ మేరకు హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబంలో తల్లిదండ్రులకు వచ్చే పూర్వీకుల ఆస్తిలో ఈ పిల్లలు కూడా వాటా పొందేందుకు హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది.

2011 నుంచి పెండింగులో ఉన్న ఈ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. చెల్లుబాటు కాని.. లేదా రద్దు చేయదగ్గ వివాహాల నుంచి పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల పూర్వీకుల ద్వారా వచ్చిన వారసత్వ ఆస్తిలో వాటా ఉండదంటూ గతంలో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ప్రస్తుత ప్ర‌స్తుత చీఫ్ జ‌స్టిస్ ఆధ్వ‌ర్యంలోని బెంచ్  విభేదించింది.

Tags:    
Advertisement

Similar News