పీకే స్ట్రాటజీ వర్కవుట్‌ కాలే!

బీహార్‌ బైపోల్‌ లో తేలిపోయిన ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ

Advertisement
Update:2024-11-24 13:16 IST

గెలిస్తే తన క్రెడిట్‌.. ఓడితే ఆ పార్టీపై, నాయకుడిపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని చెప్తూ పబ్బం గడిపే ప్రశాంత్‌ కిషోర్‌ కు రాజకీయ అరంగేట్రంలోనే భారీ షాక్‌ తగిలింది. ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టడం.. ఆ మద్దతును ఓటుగా మలుచుకోవడం అంత ఈజీ కాదు. ఈ తత్వం తొలి అడుగులోనే పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిశోర్‌ కు తెలిసి వచ్చింది. సొంత రాష్ట్రం బీహార్‌లో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే పీకే ఏర్పాటు చేసిన జన్‌ సురాజ్‌ పార్టీ ఆ నాలుగు స్థానాల్లో పోటీ చేసింది. ఏ ఒక్క చోట కూడా పీకే స్ట్రాటజీ వర్కవుట్‌ కాలేదు. ఏ నియోజకవర్గంలోనూ ఆ పార్టీ కనీసం ప్రభావం కూడా చూపలేకపోయింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ పెట్టి మొదటిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఫలితాల అనంతరం స్పందిస్తూ... దశాబ్దాల పాలనలో బీహార్‌ వెనుకబాటుతనాన్ని నిర్మూలించడంలో విఫలమైన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం.. అసెంబ్లీ బై ఎలక్షన్స్‌లో విజయం సాధించడం ఆందోళన కలిగించే విషయమని ఆపార్టీ వ్యవస్థాపకుడు పీకే అభిప్రాయపడ్డారు.

అయితే ఎన్నికల వ్యూహకర్తలు ఎన్నికల సమయంలో పార్టీల గెలవడానికి రూపొందించే వ్యూహాలు, ఇచ్చే సలహాలు క్షేత్రస్థాయిలో అమలు చేసే పార్టీ కార్యకర్తలతో పాటు బలమైన నాయకత్వం ఉంటే అవి ఫలిస్తాయి. వ్యూహకర్తల వ్యూహాలు ఎలా ఉంటాయి అంటే టీవీల ముందు కూర్చుని మైదానంలో క్రికెట్‌ ఆడుతున్న ఆటగాళ్లలకు బౌలింగ్‌ ఎలా చేయాలో, బ్యాటింగ్‌ ఎలా చేయాలో, ఫీల్డింగ్‌ ఎక్కడ పెట్టాలో లాంటివే. కానీ గ్రౌండ్‌లో దిగిన వాడికే లోతు తెలుస్తుంది. ఒక రాజకీయ నాయకుడి శక్తి సామర్థ్యాల గురించి మరో రాజకీయ నాయకుడికే తెలుస్తాయి. ముఖ్యంగా నిత్యం ప్రజల్లో ఉన్నవాడికే వారి నాడి తెలుస్తుంది. ఇప్పటివరకు పీకే నరేంద్రమోడీ మొదలు, రాహుల్‌ గాంధీ, మమతా బెనర్జీ, జగన్‌, స్టాలిన్‌ లాంటి వాళ్లకు ఎన్నికల వ్యూహకర్తగా తన సూచనలు ఇచ్చి ఉండొచ్చు. అవి కొన్నిసార్లు సక్సెస్‌ అయి ఉండొచ్చు.అయితే వాటిని అమలు చేయడం, ప్రజలకు హామీ ఇచ్చే వ్యక్తిపై ప్రజలకు విశ్వసనీయత ఉండాలి. ఎందుకంటే కార్పొరేట్‌ పాలిటిక్స్‌ చేసే పీకే లాంటి వాళ్లు దేశంలో అక్షరాస్యతలో, అభివృద్ధిలో వెనుకబడిన బీహార్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడం, వాటికి పరిష్కారాలు కనుక్కోవడం, ప్రజా సమస్యలను నెరవేరుస్తామనే భరోసా కల్పించడం లాంటి చేయాలి. కానీ పీకే అలాంటి ప్రయత్నం చేసినా ఆయనను వ్యూహకర్తగానే చూస్తారు గానీ నాయకుడిగా జనాలు చూడరు. దీనికి కారణం ఆయన తన విద్వత్తునే రాజకీయ చాతుర్యం అనుకుంటుంటారు. రాజకీయ నేతల చదువులను చూపెట్టి వాళ్లకు తెలివి లేదన్నట్టు వాదిస్తారు. జనాలకు కావాల్సింది కమిట్‌మెంట్‌ ఉన్న నాయకుడు, వాళ్లలో కామన్‌ మ్యాన్‌ లా కలిసిపోయే మనస్తత్వం ఉన్నవాడు. ఈ క్వాలిటీలేవీ పీకేలో కనిపించవవు. అందుకే ఆయన జస్ట్‌ ఎలక్షన్‌ స్ట్రాటజిస్ట్‌ మాత్రమే.. నాట్‌ ఏ బికేమ్‌ లీడర్‌.

Tags:    
Advertisement

Similar News