సంధ్య థియేటర్‌ ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

మృతురాలి కుటుంబసభ్యులకు రూ. 5 కోట్లు ఇవ్వాలని కోరిన పిటిషనర్‌ రవికుమార్‌

Advertisement
Update:2024-12-06 15:07 IST

పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. పోలీస్‌ యాక్ట్‌ కింద ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రీమియర్‌ షో ఏర్పాటు చేశారని న్యాయవాది రవికుమార్‌ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణకు స్వీకరించింది. సంధ్య థియేటర్‌ యాజమాన్యం భద్రతా ఏర్పాట్లు పాటించకపోవడంతో పాటు రద్దీని నియంత్రించకపోవడంతో ఘటన జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కుమార్‌ శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలి కుటుంబసభ్యులకు రూ. 5 కోట్లు ఇవ్వాలని పిటిషనర్‌ రవికుమార్‌ కోరారు. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మహిళ మృతి చెందింది. నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Tags:    
Advertisement

Similar News