రాజమండ్రిలో రేవ్ పార్టీ కలకలం

రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది.

Advertisement
Update:2024-12-30 15:34 IST

తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీ జరుగుతున్నట్టు పక్క సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేసి ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నరు. మూడు కార్లు స్వాధీనం చేసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువకులు రాజమండ్రికి చెందినవారిగా గుర్తించారు.

యువతులు గుంటూరుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో రేవ్ పార్టీ బయటపడింది. గోదావరి జిల్లాలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రేవ్ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.అయితే ఈ రేవ్ పార్టీలో అందరూ మద్యం సేవించారని, డ్రగ్స్ వాడలేదని రాజమండ్రి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. రాత్రి అంతా నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ పెట్టుకుని, డ్యాన్సులు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో ఎక్కువగా ఏపీలో రికార్డింగ్ డ్యాన్స్‌లు జరుగుతాయి

Tags:    
Advertisement

Similar News