పోక్సో కేసులో యడ్యూరప్పకు ముందస్తు బెయిల్
ఎఫ్‌ఐఆర్ ను క్వాష్ చేయడానికి నిరాకరించిన హైకోర్టు
Advertisement
కర్నాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు పోక్సో కేసులో కర్నాటక హైకోర్టు మందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ను కొట్టివేయాలన్న యడ్యూరప్ప అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తనపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 2022 ఫిబ్రవరిలో 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేసింది. ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్ ను క్వాష్ చేయడంతో పాటు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని యడ్యూరప్ప హైకోర్టుకు ఆశ్రయించారు. ఆయన ముందుస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు అరెస్టు నుంచి ఊరటనిచ్చింది. అదే కేసులో సమయంలో కేసు విచారణ ఎదుర్కోవడం తప్పనిసరి అని తేల్చిచెప్పింది.
Advertisement